Director Hanu Raghavapudi: రామ్ పాత్ర ఓ అద్భుతం.. అందుకే బతికించలేదు.. సీతారామం క్లైమాక్స్ పై హను రాఘవపూడి వివరణ..

ఈ సినిమాలో క్లైమాక్స్ లో హీరో రామ్ చనిపోవడం ఏ ఒక్కరికి నచ్చలేదు. రామ్, సీత కలిసి ఉండాలని.. ఇద్దరిని కలపాలంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ చేశారు నెటిజన్స్. అయితే తాజాగా సీతారామం క్లైమాక్స్ గురించి అందంగా వివరించారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ పాత్రను చంపేయడం గురించి చెప్పుకొచ్చారు.

Director Hanu Raghavapudi: రామ్ పాత్ర ఓ అద్భుతం.. అందుకే బతికించలేదు.. సీతారామం క్లైమాక్స్ పై హను రాఘవపూడి వివరణ..
Director Hanu Raghavapudi

Updated on: Aug 19, 2024 | 10:36 AM

సీతారామం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఓ అద్భుత సినిమా. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో వీరిద్దరి జోడికి అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్, ఎమోషనల్స్ సీన్స్ గురించి చెప్పక్కర్లేదు. హను రాఘవుపూడి డైరెక్షన్, డైలాగ్స్, సాంగ్స్, ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టేలా చేశాయి. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ లో హీరో రామ్ చనిపోవడం ఏ ఒక్కరికి నచ్చలేదు. రామ్, సీత కలిసి ఉండాలని.. ఇద్దరిని కలపాలంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ చేశారు నెటిజన్స్. అయితే తాజాగా సీతారామం క్లైమాక్స్ గురించి అందంగా వివరించారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ పాత్రను చంపేయడం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. అసలు రామ్ పాత్రను ఎందుకు చంపేశారు అంటూ ప్రశ్నించింది. అందుకు డైరెక్టర్ మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు.

డైరెక్టర్ హను మాట్లాడుతూ.. “ఈ సినిమాకు మొదటిసారి కథ రాసిన దగ్గర నుంచి రామ్ పాత్రకు అది తప్ప వేరే ఆప్షన్ లేదు. తను ఎలా వస్తాడు.. వస్తే ఏం జరుగుతుంది.. సినిమా అయిపోతుంది. ఇక కథ అక్కడితో అయిపోతుంది. కానీ ఆ క్యారెక్టర్ మీతోపాటు ఉండదు. అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా రామ్ ను బతికించాలని నాతో ఫైట్ చేశారు. బతికిద్దామంటూ చాలా రోజులు నాతో వాదించారు. ఇన్ని కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చిన రామ్ చనిపోవడమేంటీ అని అనుకున్నారు. కానీ రామ్ అనే పాత్ర ఓ అద్భుతం. అలా అందరూ ఉండలేరు. అలాంటి తనన తిరిగి తీసుకువస్తే కేవలం అది ఓ క్యారెక్టర్ అయిపోతుంది. రామ్ మాములు వ్యక్తి అయిపోతాడు”అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే సీతారామం క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ అని యాంకర్ అనగా.. విషాదకరమైన ఎండింగ్ కాదు హ్యాపీ ఎండింగ్ అని అన్నారు. చాలా మంది దీనిని సాడ్ ఎండింగ్ అని అంటారు. కానీ నేను ఒప్పుకోను. అసలు అది సాడ్ ఎండింగ్ కాదు.. కలవడమే ఆనందకరమైన ఎండింగ్ కాదు.. ఈ కథలో ఆ అమ్మాయికి ఈ లెటర్ రావడమే సంతోషమైన ఎండింగ్. అది ఓ లెటర్ స్టోరీ కనుక ఇది హ్యాపీ ఎండింగ్. అక్కడ గతంలో జరిగిపోయింది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆ లెటర్ ఆ అమ్మాయికి రాకపోతే అప్పుడు అది సాడ్ ఎండింగ్ అంటూ వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం హను రాఘవపూడి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.