Balakrishna: అఖండ సీక్వెల్ ఎలా ఉండబోతుందంటే.. హింట్ ఇచ్చిన బోయపాటి.. ఫ్యాన్స్‌కు పూనకాలే

|

Apr 17, 2024 | 7:46 AM

బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. అంత ముందు ఈ ఇద్దరి కాంబోలో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు వచ్చాయి. ఇక అఖండ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు.

Balakrishna: అఖండ సీక్వెల్ ఎలా ఉండబోతుందంటే.. హింట్ ఇచ్చిన బోయపాటి.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Akhanda 2
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. అంత ముందు ఈ ఇద్దరి కాంబోలో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు వచ్చాయి. ఇక అఖండ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. అలాగే అఘోరా పాత్రలో నటించి మెప్పించారు నటసింహం. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ముందు నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆతర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో బాలయ్య యాక్షన్ మోడ్ లో కనిపించారు.

అయితే బాలయ్య త్వరలోనే అఖండ 2 చేస్తారని నందమూరి అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖండ సీక్వెల్ పై దర్శకుడు బోయపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన నెక్స్ట్  ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తానని బోయపాటి అన్నారు. అఖండ సీక్వెల్‌ ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నకు.. అఖండ సీక్వెల్‌లో సమాజానికి ఏం అవసరమో అదే చూపిస్తాను.. అని చెప్పుకొచ్చారు బోయపాటి. మరి ఎన్నికల తర్వాత బోయపాటి బాలయ్య సినిమాను మొదలు పెడతారా..? లేక మరో సినిమా చేస్తారా.? అన్నది చూడాలి.

బోయపాటి శ్రీను ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్…

బోయపాటి శ్రీను ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.