Orange: ‘ఆరెంజ్’ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారో తెల్సా..? చాలా గొప్పగానే థింక్ చేశారు..

|

Apr 19, 2023 | 11:18 AM

ఆరెంజ్ సినిమా ఇప్పటి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. అప్పట్లో మాత్రం మేకర్స్‌కు నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని పాటలు అయితే ఇప్పుడు వింటున్నా మనసును ఆహ్లాదపరుస్తాయి. సినిమా లోకేషన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి.

Orange:  ఆరెంజ్ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారో తెల్సా..? చాలా గొప్పగానే థింక్ చేశారు..
Orange Film
Follow us on

రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా థియేటర్లలో రిలీజైనప్పుడు అంతలా ఆడలేదన్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాతి కాలంలో సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. టీవీల్లో కూడా భారీ రేటింగ్స్ అందుకుంది. అంటే కాలక్రమేణా జనాల మైండ్ సెట్ కాస్త పరిణితి చెందింది అని చెప్పుకోవచ్చు. చరణ్ కూడా తనకు ఈ సినిమా బాగా ఇష్టమైనదని.. కానీ ఎందుకు ప్లాప్ అయిందో అర్థం కాలేదని తన సన్నిహితులతో అంటూ ఉంటారు. అంతెందుకు మొన్నీమధ్య సినిమా రీ రిలీజ్ చేస్తే.. చూసేందుకు యువత ఎగబడడ్డారు. పార్ట్ 2 తియ్యండి అన్న అంటూ థియేటర్‌లో డైరెక్టర్‌ను వేడుకున్నారు. అప్పుడు చిన్న పిల్లలం అర్థం చేసుకోలేకపోయాం అంటూ ఆయనకు సారీ చెప్పారు. అది ఆరెంజ్ ఇంపాక్ట్. అయితే ఈ మూవీకి  ‘ఆరెంజ్’ అనే పేరు ఎందుకు పెట్టారో చాలామందికి తెలియదు. దీనిపై తాజాగా క్లారిడీ ఇచ్చాడు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్.

సినిమా థీమ్‌ ప్రకారం టైటిల్‌ పెట్టినట్లు తెలిపారు. ప్రేమ కొంతకాలం తర్వాత తగ్గుతుంది.. అప్పుడు మరొక వ్యక్తిని లవ్ చెయ్యాలని ఆరెంజ్ సినిమా చెబుతుందని వివరించారు. ఒక వ్యక్తి పట్ల లవ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. రిలేషన్‌లో ఎత్తుపల్లాలు ఉంటాయన్నారు భాస్కర్. ఆరెంజ్ సినిమా థీమ్‌ను సన్ రైజ్, సన్ సెట్‌తో పోల్చినట్లు వివరించారు. ఈ రెండు సమయాల్లోనూ సూర్యుడు ఆరెంజ్ కలర్‌లో ఉంటాడని పేర్కొన్నారు. ప్రేమ పుట్టడాన్ని సూర్యోదయం  సూచిస్తుందని.. అందుకే ఆ సమయంలో అది చాలా బ్రైట్‌గా ఉంటుందన్నారు. అలానే సూర్యాస్తమయం అనేది ప్రేమ‌ ముగియడానికి సంకేతంగా తీసుకున్నట్లు చెప్పారు. అందుకే ఈ చిత్రానికి ‘ఆరెంజ్’ అనే పేట్టాలనుకున్నామని.. దాన్ని అందరూ అంగీకరించారని భాస్కర్ తెలిపారు.

బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు భాస్కర్. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆరెంజ్ నిరాశపరిచింది. అనంతరం చేసిన బంగోలు గిత్త, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు కూడా ఆయన్ను నిరాశపరిచాయి. సరైన హిట్ ఇచ్చి మళ్లీ కమ్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు భాస్కర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.