మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. యువ కథానాయకుడు కిరణ్ అన్నవరం హీరోగా నటించిన ఈ చిత్రంలో కశ్మీర హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం నుండి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి అంచనాలను క్రియేట్ చేసాయి.
అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి 16న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది చిత్రయూనిట్. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన డైరెక్టర్ బాబీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
“కోలీవుడ్ లో శివ కార్తికేయన్ మాదిరిగా, తెలుగులో కిరణ్ అబ్బవరం ఎదుగుతుండటం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ఎవరైనా సరే హీరో కావాలనో.. డైరెక్టర్ కావాలనో ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ అల్లు అరవింద్ గారిలా నిర్మాత కావాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిగా బన్నీ వాసును చూస్తున్నాను. తాను నిర్మాత కావడమే కాకుండా కొత్త వాళ్లకి అవకాశాలిస్తూ వెళ్లడం ఆయన ప్రత్యేకతగా కనిపిస్తోంది. నేను చదువుకునే రోజుల్లో .. చిరంజీవిగారి దగ్గరికి ఏ సమస్య వెళ్లకుండా అరవింద్ గారు చూసుకుంటూ ఉంటారు అని చెప్పుకుంటూ ఉండేవారు. అలా ఇప్పుడు బన్నీగారి విషయంలో బన్నీ వాసు కనిపిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది” అని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.