Anil Ravipudi: ఏంటీ.. నాని ఆ సినిమా క్లైమాక్స్ అనిల్ రావిపూడి రాశారా..? ఆ మూవీ సూపర్ హిట్టు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు పరాజయం తెలియని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మరో సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

Anil Ravipudi: ఏంటీ.. నాని ఆ సినిమా క్లైమాక్స్ అనిల్ రావిపూడి రాశారా..? ఆ మూవీ సూపర్ హిట్టు..
Anil Ravipudi, Nani

Updated on: Jan 26, 2025 | 8:31 AM

తెలుగు సినీప్రియులకు ఇష్టమైన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. రచయితగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. ఆ తర్వాత దర్శకుడిగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. పటాస్ సినిమా నుంచి మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ వరకు మొత్తం 8 సినిమాలు తీసి 8 హిట్స్ అందుకున్నాడు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరితో సినిమాలు తెరెకక్కించి విజయాలను అందుకున్నాడు. ఇటీవలే సంక్రాంతికి పండక్కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఇప్పటికే దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

రైటర్ గా ఉన్న సమయంలో నాని నటించిన అలా మొదలైంది సినిమాకు తాను వర్క్ చేసినట్లు తెలిపాడు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిత్యా మీనన్ కు మొదటి తెలుగు సినిమా. దర్శకురాలిగా నందినిరెడ్డికి సైతం ఫస్ట్ మూవీ. సినిమా షూటింగ్ అయ్యాక ఎడిటింగ్ సమయంలో అనేక తప్పులు చెప్పారట. దీంతో ఆ సినిమా ఆగిపోయే సమయంలో అనిల్ రావిపూడి వెళ్లారట. ఆ సినిమా చూసి ఫుల్ గా నవ్వుకున్నారట. ఆ సినిమా చూసి తన ఫుల్ ఎంజాయ్ చేశానని.. నాని, నిత్యా మీనన్ కాంబో బాగుందని చెప్పారట. అదే విషయం నందినికి చెబితే షాక్ అయ్యిందని.. దీంతో నిజంగానే బాగుందా అని అడిగితే ఇంత మంచి కామెడీ సినిమా తీశావ్ అని చెప్పానని అన్నారు.

నిర్మాతకు సైతం అదే విషయాన్ని చెప్పానని.. అప్పుడు నిర్మాత దాముగారు వేరే వాళ్లు ఆ మూవీ గురించి రాసిన నెగిటివ్స్, డౌట్స్ అన్ని తీసి ఇచ్చారని.. వాటిల్లో కొన్నింటికి ఆన్సర్స్ ఇచ్చానని అన్నాు. స్క్రీన్ ప్లే కాస్త మారిస్తే బెటర్ అని.. క్లైమాక్స్ కాస్త మార్చాలని అనిపించిందని.. దీంతో తననే కూర్చొని రాయమన్నారని.. అలా నాని, నందిని, తను కలిసి మాట్లాడుకుంటూ స్క్రీన్ ప్లే ఫైనల్ చేశామని అన్నారు. ఆశిష్ విద్యార్థి సీన్స్ యాడ్ చేసి మళ్లీ షూట్ చేశారని అన్నారు. షూటింగ్ సమయంలో మళ్లీ డైట్స్ వస్తే తను వెళ్లానని.. నానితో గంట సేపు డిస్కస్ చేసి ఫైనల్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..