Anil Ravipudi: ‘నా భార్యకు అలాంటి వీడియోలు పంపుతున్నారు’.. సైబర్ క్రైమ్ పోలీసులకు స్టార్ డైరెక్టర్ ఫిర్యాదు

వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. డైరెక్టర్ గా పటాస్ తో మొదలైన అతని సినీ ప్రస్థానం సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అప్రతిహతంగా సాగుతోంది. రాజమౌళి తర్వాత సినిమా ఇండస్ట్రీలో అపజయమెరుగని డైరెక్టర్ గా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Anil Ravipudi: నా భార్యకు అలాంటి వీడియోలు పంపుతున్నారు.. సైబర్ క్రైమ్ పోలీసులకు స్టార్ డైరెక్టర్ ఫిర్యాదు
Anil Ravipudi

Updated on: Mar 02, 2025 | 7:23 AM

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావి పూడి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము రేపేందుకు సిద్ధంగా ఉంది. శనివారం (మార్చి 01) సాయంత్రం నుంచే జీ5 ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నారు అనిల్ రావి పూడి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడీ క్రేజీ డైరెక్టర్. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు కుదిరితే భవిష్యత్ లో హీరోగా సినిమా చేస్తానన్నాడు. అయితే ఆ సినిమాకు హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి తీసుకోండి, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని యాంకర్‌ అనడంతో అనిల్ ఆశ్చర్యపోయాడు. యాంకర్ కామెంట్‌కు స్పందించిన అనిల్

‘ మా మధ్య కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లు ఏం లేవు. ఇప్పటికే మా గురించి యూట్యూబ్‌లో రకరకాలుగా కథనాలు రాస్తున్నారు. నాయనా.. నేనేదో ప్రశాంతంగా నా సినిమాలేవో నేను తీసుకుంటున్నాను. వీళ్లేమో యూట్యూబ్‌లో వాయిస్‌ ఓవర్‌తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు నా భార్యకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో పంపిస్తున్నారు. నా గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబూ’

ఇవి కూడా చదవండి

చాలా ఇబ్బంది పడుతున్నాం..

‘ఇలాంటి అసత్య వార్తలపై నేను ఇప్పటికే సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను. మర్యాదగా ఆ వీడియోలు యూట్యూబ్‌లో నుంచి తీసేయండి. లేదంటే మిమ్మల్ని బ్లాక్‌ చేస్తారు. నాకెటువంటి కెమిస్ట్రీలు లేవు. నా గురించే కాదు చాలామంది గురించి ఇలాగే ఇష్టమొచ్చినట్లు కథలు అల్లుతున్నారు. వ్యూస్‌ కోసం లేని కథను అందమైన వాయిస్‌ ఓవర్‌తో క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో రిలీజ్‌ చేస్తున్నారు. వీటిని చూసిన చాలామంది అవి నిజమని నమ్ముతున్నారు. ఇలాంటి వాటి వల్ల చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నారు. లేనిపోనివి రాయకండ్రా బాబూ’ అని అనిల్‌ రావిపూడి కోరాడు. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో అనిల్ రావి పూడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి