Tollywood: ఇండస్ట్రీలో మరో లవ్ బర్డ్స్.. ఆ యంగ్ హీరోతో తెలుగు హీరోయిన్ ప్రేమాయణం.. క్లారిటీ ఇదే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది కళ్యాణి ప్రియదర్శన్. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. అలాగే తెలుగులో ఈ బ్యూటీ నటించిన ఏ సినిమా హిట్ కాకపోవడంతో మలయాళీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది.

Tollywood: ఇండస్ట్రీలో మరో లవ్ బర్డ్స్.. ఆ యంగ్ హీరోతో తెలుగు హీరోయిన్ ప్రేమాయణం.. క్లారిటీ ఇదే.
Kalyani Priyadarshan

Updated on: Apr 18, 2025 | 9:56 PM

తెలుగు చిత్రపరిశ్రమలో తక్కువ సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులో ఇప్పటివరకు సరైన హిట్టు అందుకోలేదు. కానీ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో కళ్యాణికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. హలో తర్వాత శర్వానంద్ రణరంగం, తేజ్ చిత్రలహరి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో కళ్యాణికి అవకాశాలు రాలేదు. కానీ తమిళం, మలయాళంలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం మలయాళీలంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడిందనే వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అతడు మరెవరో కాదు.. ప్రణవ్ మోహన్ లాల్.

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ప్రేమలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పడిందనే టాక్ నడుస్తుంది. కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే దర్శకుడు అలెప్పీ అష్రఫ్ ఈ రూమర్స్ పై స్పందించారు. తనకు ఇరు కుటుంబాలతో మంచి పరిచయాలు ఉన్నాయని.. వీరి ప్రేమ వార్తలపై లిజీ (కళ్యాణి తల్లి)ని అడగ్గా.. అదే నిజమైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తమ పిల్లల మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఆమె తేల్చి చెప్పారని అలెప్పీ అన్నారు. ప్రణవ్ ప్రేమలో ఉన్న మాట నిజమే అని.. కానీ తను కళ్యాణి కాదని.. జర్మనీకి చెందిన ఓ అమ్మాయితో ప్రణవ్ ప్రేమలో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ప్రణవ్, కళ్యామి కలిసి హృదయంలో చిత్రంలో నటించారు. 2022లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరు కలిసి పలు సినిమాలకు వర్క్ చేశారు. అప్పటి నుంచే వీరి ప్రేమలో ఉన్నారనే టాక్ మొదలైంది.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?