Dil Raju: ఆయనతో సినిమా చేసే ఛాన్స్ రాలేదు.. పెళ్లి సందD ఈవెంట్‏లో అసలు విషయం చెప్పిన దిల్ రాజు..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కిస్తున్న సినిమా పెళ్లి సందD. ఇందులో హీరో శ్రీకాంత్ తనయుడు

Dil Raju: ఆయనతో సినిమా చేసే ఛాన్స్ రాలేదు.. పెళ్లి సందD ఈవెంట్‏లో అసలు విషయం చెప్పిన దిల్ రాజు..
Dilraju

Edited By:

Updated on: Oct 11, 2021 | 11:30 AM

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కిస్తున్న సినిమా పెళ్లి సందD. ఇందులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా జంటగా నటిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‍గా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని.. దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెకెత్తించగా.. ఇందులో సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక విడుదలకు ముందే ఈ సినిమా ప్రమోషన్స్‏తోనే భారీ బిజినెస్ అందుకుంటుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా.. నిన్న హైదరాబాద్‎లో సాయంత్రం పెళ్లి సందD ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. అలాగే ఇతర సినీ ప్రముఖులు, నిర్మాతలు కూడా హజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..రాఘవేంద్ర రావు గారి ఏవీ చూసిన వెంటనే తనకు వైబ్రేషన్స్ వచ్చాయని.. రాఘవేంద్రరావు గారు ఎందరో స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారని.. తెలుగు సినిమమా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. ఇక తన బ్యానర్లో రాఘవేంద్ర రావుతో సినిమా చేసే అవకాశం దొరకలేదని చెప్పుకొచ్చారు. అందుకు తాను ఇండస్ట్రీలోకి ఆలస్యంగా రావడమే కారణమని చెప్పుకొచ్చారు. అయితే మొదటిసారిగా రాఘవేంద్రరావు నటుడిగా పరిచయం చేసే అవకాశం కూడా కోల్పోయినట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే శతమానం భవతి సినిమాలోని తాతా పాత్ర కోసం రాఘవేంద్రరావుని అడిగానని.. కానీ.. యాక్టింగ్ అంటే భయపడి అందుకు ఒప్పుకొలేదని చెప్పుకొచ్చారు. అయితే తాను అడిగినప్పుడు చేయకపోయిన.. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక ఇప్పటివరకు తాను 50 సినిమాలు నిర్మించానని..కానీ సినిమా స్టోరీ విషయంలో రాఘవేంద్రరావు గారు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. ఇక పెళ్లి సందD చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు తెలిపారు దిల్ రాజు.

Also Read: Megastar Chiranjeevi: అలాంటి వారిని దూరం పెట్టాలి.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా ?.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

Bigg Boss 5 Telugu: కాజల్ ఫేక్… ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు తెలియకుండా మాట్లాడకు.. హమీదా సూచన..