దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారీసు. ఈ సినిమాను తెలుగు వారసుడు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. యూట్యూబ్ లో ఈ రెండు సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తమిళ్ సినిమా అయినప్పటికీ మన దగ్గర కూడా ఈ సినిమా పౌ భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే వారసుడు సినిమాను ముందుగా మన టాలీవుడ్ హీరోలతో చేయాలని అనుకున్నారట. ఈ మూవీ కోసం ఇద్దరు స్టార్ హీరోలను కూడా సంప్రదించారట.
ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలతో పోటీపడటానికి దళపతి విజయ్ కూడా సిద్దమయ్యారు. సంక్రాంతి అటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య.. ఇటు బాలయ్య బాబు వీరసింహారెడ్డి సినిమాలతో సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో దళపతి వారసుడు అంటూ బరిలోకి దూకుతున్నారు. అయితే ఈ సినిమాను ముందుగా మన టాలీవుడ్ స్టార్ హీరోలతో అనుకున్నారట దిల్ రాజు
దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వారసుడు సినిమాను ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని అనుకున్నాం. కానీ ఆయన మరో సినిమాతో బిజీగా ఉండటంతో అది కుదరలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్ ని హీరోగా ఎంపిక చేయాలని చూశాం.. కానీ అప్పటికే చరణ్ శంకర్ సినిమాను కమిట్ అయ్యాడు. దాంతో దళపతిని సంప్రదించాం. కథ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పేశారు అని తెలిపారు దిల్ రాజు. ఇక సంక్రాంతికి రికార్డు స్థాయి థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది వారసుడు. ఈ సినిమాకు ఇప్పటికే 50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇక రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.