Deepika Padukone -Ranveer Singh: బిగ్ షాక్ ఈ జంట కూడా విడిపోతున్నారా..? రణవీర్ ఏమన్నాడంటే!

|

Oct 01, 2022 | 7:06 AM

ప్రముఖ ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు మెంబర్ ఉమైర్‌ సంధు గత రెండు రోజుల ముందు దీపికా, రణ్‌వీర్‌ మధ్య విభేదాలు ఉన్నట్లు ఓ ట్వీట్‌ చేశాడు.

Deepika Padukone -Ranveer Singh: బిగ్ షాక్ ఈ జంట కూడా విడిపోతున్నారా..? రణవీర్ ఏమన్నాడంటే!
Deepika Padukone, Ranveer S
Follow us on

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీళ్ళద్దరి మధ్య భేదాబిప్రాయలు ఉన్నట్లు సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రముఖ ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు మెంబర్ ఉమైర్‌ సంధు గత రెండు రోజుల ముందు దీపికా, రణ్‌వీర్‌ మధ్య విభేదాలు ఉన్నట్లు ఓ ట్వీట్‌ చేశాడు. అయితే ఆ ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌ అయింది. దాంతో చాలా మంది వీళ్ళద్దరి మధ్య అంతా బాగాలేదని అనుకుంటున్నారు. కాగా మరికొందరు మాత్రం ఉమైర్‌ సంధు చెప్పేవి అన్ని అసత్యాలే, ఇతని మాటలు ఎవరు నమ్మకండి అంటూ కామెంట్స్‌ చేశారు. కాగా తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవలే ముంబైలో ఎఐసీసీఐ ఈవెంట్‌కు హాజరైన రణ్‌వీర్‌.. తనపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. దీపికా అంటే తనకు చాలా గౌరవమని, తనని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటానని చెప్పాడు. ఇక దీపికాతో సినిమా షూటింగ్‌ గురించి మాట్లాడుతూ ‘తనతో మళ్ళీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు’ తెలిపాడు. ‘వ్యక్తిగతంగా కూడా తన  నుంచి ఎంతో నేర్చుకున్నానని’ తెలిపాడు. అంతేకాకుండా ‘మీ అందరికి ఒక మంచి సర్‌ప్రైజ్‌ ఉంది. త్వరలోనే తమను కలిసి చూస్తారు’ అంటూ పుకార్లకు చెక్‌ పెట్టాడు.

ప్రస్తుతం రణ్‌వీర్‌ రెండు చిత్రాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘రాకీ అవుర్‌ రాణికి ప్రేమ్‌ కహాని’ షూటింగ్ పూర్తికాగా.. ‘సర్కస్‌’ చిత్రీకరణ దశలో ఉంది. ఇక దీపికా పదకొనే కూడా చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె నటించిన పఠాన్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌-కే చిత్రాన్ని చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..