Tollywood: ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కోట్లాది ఆస్తులు.. ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సినిమా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఈజీగా అరంగేట్రం చేయవచ్చు. ఆ తర్వాత కూడా సులభంగా సినిమా అవకాశాలు లభిస్తాయి. కానీ ఈ హీరోయిన్ కథ డిఫరెంట్. సినిమా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ..

Tollywood: ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కోట్లాది ఆస్తులు.. ఎవరో తెలుసా?
Tollywood Actress

Updated on: Jan 23, 2025 | 3:47 PM

తండ్రి దక్షిణాదిలో ఫేమస్ నటుడు. హీరోతో పాటు సహాయక నటుడిగా సుమారు 50కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇక ఈ నటుడి సోదరి కూడా ఫేమస్ నటినే. దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించింది. సాధారణంగా ఇలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి జీవితం పూలపాన్పే. కానీ ఈ హీరోయిన్ స్టోరీ చాలా డిఫరెంట్. చేయిపట్టి నడిపించాల్సిన నాన్న చిన్న వయసులోనే కన్నుమూశాడు. నాన్న లేకపోయినా అన్నా అని పిలిచే అవకాశం కూడా లేకుండా ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇంటి పోషణ కోసం సేల్స్ గర్ల్ గా పనిచేసిందీ అందాల తార. అదే సమయంలో మోడలింగ్ చేస్తూ సినిమా అవకాశాలు సంపాదించుకుంది. టీవీ షోస్, ప్రోగ్రామ్స్ చేస్తూనే గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా తమిళ్ లో చాలానే సినిమాలు చేసింది. కానీ తెలుగు అమ్మాయి ఉండి టాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు రాలేదీ అందాల తారకు. అడపాదడపా సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయిందీ. అయితే ఇటీవల రిలీజైన ఓ సినిమాతో తెలుగు నాట కూడా ట్రెండ్ అవుతోంది. ఆమె మరెవరో కాదు సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫేమ్ భాగ్యం అలియాస్ ఐశ్వర్యా రాజేష్.

ఐశ్వర్యా రాజేష్ తండ్రి రాజేష్ గతంలో నటుడిగా, హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ఇక ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి ఈమెకు అత్తయ్య అవుతుంది. అయితే ఐశ్వర్య రాజేష్ తండ్రి ఈమె చిన్నప్పుడే మరణించారు. ఇద్దరు సోదరులురోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ పోషణ కోసం టీనేజ్ లోనే సేల్స్ గర్ల్ గా పనిచేశానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ఐశ్వర్య. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ రాంబంటు సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఐశ్వర్య. ఆ తర్వాత టీవీ హోస్ట్ గా, హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్యా రాజేష్..

ఐశ్వర్య తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ తదితర సినిమాల్లో నటించింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మెయిన్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఇందులో ఐశ్వర్య పోషించిన భాగ్యం రోల్ కు ప్రశంసలు వస్తున్నాయి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.