Suman: ఇండస్ట్రీలో సుమన్ ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? జైలు నుంచి విడిపించేందుకు ఆ హీరో చేయని ప్రయత్నం లేదు

స్టార్ హీరో రేంజ్ కు ఎదగాల్సిన సుమన్ ఓ కేసు కారణంగా రేసులో వెనకబడిపోయాడు. హీరోగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే కష్టమైనా, సుఖమైనా సుమన్ వెంట నడిచిన ఓ హీరో ఉన్నాడు. అతను సుమన్ కు బెస్ట్ ఫ్రెండ్ కూడా.

Suman: ఇండస్ట్రీలో సుమన్ ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? జైలు నుంచి విడిపించేందుకు ఆ హీరో చేయని ప్రయత్నం లేదు
Suman

Updated on: Jun 17, 2026 | 8:25 PM

సుమన్.. ఇప్పుడంటే విలన్ పాత్రలు, సహాయక నటుడి రోల్స్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు దక్షిణాదిలో ఉన్న స్టార్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. తన నటనతో మరీ ముఖ్యంగా కరాటే ఫైట్స్, యాక్షన్ సీన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారీ సీనియర్ యాక్టర్. 1978లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సుమన్. సుమారు ఐదు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా రాణించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం.. ఇలా మొత్తం 10 భాషల్లో సుమారు 700 సినిమాలు చేశారు సుమన్. అయితే స్టార్ హీరోగా ఎదగాల్సిన సుమన్ ఒక కేసు కారణంగా ఇబ్బందుల్లో పడ్డాడు. కొన్ని రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇందులో కొందరి స్టార్స్ కుట్ర ఉందన్న ప్రచారం జరిగినప్పటికీ అందులో ఏ మాత్రం నిజం లేదని స్వయంగా హీరో సుమనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తను బాగా నమ్మిన కొందరి వల్లనే జైలు పాలయ్యానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో సుమన్ కు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. సుమన్ కష్ట సుఖాల్లోనూ ఆ బెస్ట్ ఫ్రెండ్ అండగా నిలిచాడు. ముఖ్యంగా సుమన్ జైలులో ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేయడానికి ఎవరు ముందు రాకపోయినా ఆ హీరో మాత్రం ముందుకు వచ్చాడు. సుమన్ ను జైలు నుంచి విడిపించేందుకు తనకున్న అవకాశాలతో శత విధాలా ప్రయత్నించారు. ఆయన మరెవరో కాదు సుమన్ లానే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన భాను చందర్.

కాగా ఈ కేసులో సుమన్ తో పాటు భాను చందర్ పేరును కూడా లాగేందుకు ప్రయత్నాలు జరిగాయట. అయితే ముందే ఈ విషయం పసిగట్టిన సుమన్ తన స్నేహితుడు ఇబ్బందుల్లో పడకూడదని భానుచందర్ కు దూరంగా ఉండిపోయారట. పరిస్థితులు చక్కబడే వరకు ఆయనతో కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదట. అయితే భాను చందర్ మాత్రం సుమన్ ను కాపాడేందుకు శత విధాలా ప్రయత్నించారట. తనకున్న పరిచయాలతో ఆయనను జైలు నుంచి విడిపించేందుకు చాలా ప్రయత్నం చేశారట. ఇక ఈ కేసుల తరువాత చాలామంది సుమన్ కు దూరం అయ్యారట. కానీ భానుచందర్‌ మాత్రం ఇప్పటికీ సుమన్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి

భాను చందర్ తో సుమన్..

Suman, Bhanuchander

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us