
ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎగబడి చూస్తున్నారు సినిమా ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ జానర్ సినిమాకలు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఏడేళ్ల క్రితమే ఓ బ్లాక్ బస్టర్ సైకో థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఇప్పటివరకు దీన్ని కొట్టే సైకో థ్రిల్లర్ సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను మూడు భాషల్లో తీస్తే మూడు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే ఛానెల మార్చుకుండా చూసేస్తారు. ‘సైకో థ్రిల్లర్ మూవీస్ కా బాప్’ ఈ భావించే ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి.. లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియెన్స్ ను కట్టి పడేస్తుంది. ఇక ట్విస్టులకు అయితే మైండ్ బ్లాక్ కావాల్సిందే. అయితే ఈ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ కథను మొత్తం 18 మంది హీరోలకు వినిపించారట మేకర్స్. అందులో 17 మంది హీరోలు రిజెక్ట్ చేస్తే ఒక చిన్న హీరో చేసి ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ సినిమా మరేదో కాదు రాట్ససన్ మూవీ. అదేనండి తెలుగులో రాక్షుసుడు.
రాట్ససన్ సినిమా ఒక్క తమిళంలోనే కాదు ఇండియాలోనే ది బెస్ట్ సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకుంటుంటారు. ఇక ఈ సినిమాలో హీరోగా విష్ణు విశాలు నటించగా.. ఆతనికి జోడీగా అమలాపాల్ నటించింది. అయితే ఈ సినిమా కథను దర్శకుడు రామ్ కుమార్ మొదట 18 మందిస్టార్ హీరోలకు చెప్పాడట. అందులో 17 మంది రిజెక్ట్ చేస్తే.. చివరికి, విష్ణు విశాల్ ఈ మూవీకి ఓకే చెప్పాడట. అప్పటికి కోలీవుడ్‌లో చిన్న హీరోగా వెలుగొందుతోన్న విష్ణు విశాల్ రాట్ససన్ దెబ్బకు క్రేజీ హీరోల లిస్టులో చేరిపోయాడు.
కాగా ఇదే సినిమాను తెలుగులో రాక్షుడిగా రీమేక చేశారు. ఇక్కడ బెల్లం కొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లు గా నటించారు. ఇక హిందీ వెర్షన్ లో అక్షయ్ కుమార్ హీరోగా కనిపించాడు.
To My Mira
You are going to grow up in the presence of remarkable women—each one strong in her own way, each one carrying the wisdom of her own journey. Look around you: your grandmothers ,aunts, cousins, teachers, family friends—they are living proof that strength comes in many… pic.twitter.com/SbRP8cJBuO
— Gutta Jwala 💙 (@Guttajwala) July 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..1578841,1578828,1578788,1578684