Samarasimha Reddy:బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ‘సమరసింహా రెడ్డి’ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

సినిమా కథల ఎంపికలో హీరోల అభిప్రాయం బట్టి ఇండస్ట్రీలో కొన్ని కథలు తరచూ చేతులు మారుతుంటాయి. బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సమరసింహా రెడ్డి విషయంలో జరిగింది. ఈ సినిమాను ఓ స్టార్ హీరో మిస్ అయ్యాడని మీకు తెలుసా?

Samarasimha Reddy:బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ సమరసింహా రెడ్డిని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Samarasimha Reddy

Updated on: Sep 06, 2025 | 9:57 PM

సమరసింహారెడ్డి.. బాలకృష్ణ కెరీర్ లో మరుపురాని చిత్రల్లో ఇది కూడా ఒకటి. 1999లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో బి. గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు ఆడి పాడారు. అంజలా ఝవేరి, సిమ్రాన్, సంఘవి నందమూరి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎప్పటిలాగే బాలయ్య నటనలో తన విశ్వరూపం చూపించారు. అలాగే మణిశర్మ పాటలు, డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు సమరసింహారెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించాయి. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ 15 కోట్ల షేర్ ను రాబట్టి అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 227 రోజులు మూడు థియేటర్లలో, 175 రోజులు 29 కేంద్రాల్లో,50 రోజులు 122 కేంద్రాల్లో ఆడి.. బాలయ్య కెరీర్ లోనే మరపురాని చిత్రంగా సమరసింహారెడ్డి నిలిచిపోయింది. ఈ సినిమాతో బాలకృష్ణ ఇమేజ్‌ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అంతే కాదు సమర సింహారెడ్డి తర్వాత తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల జోరు కూడా పెరిగిపోయింది. దీని తర్వాత బాలయ్య నటించిన నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమ సింహం సినిమాలు కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినవే. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ఇంద్ర, వెంకటేష్ జయం మనదేరా సినిమాలు కూడా రాయల సీమ ఫ్యాక్షన నేపథ్యంలో తెరకెక్కినవే.

మొత్తానికి తెలుగులో సమర సింహారెడ్డి సినిమాతోనే ఫ్యాక్షన్ సినిమాలకు పునాది పడింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కథ బాలకృష్ణ కోసం రాసింది కాదట. ముందుగా ఈసినిమా కోసం డైరెక్టర్ బి. గోపాల్ మరో స్టార్ హీరోను అనుకున్నారనట. ఈ కథ మొదట విక్టరీ వెంకటేష్ దగ్గరకు వెళ్లిందట. బి. గోపాల్ ఈ కథను వెంకటేష్‌కు వినిపించగా, ఆయనకు కూడా విపరీతంగా నచ్చిందట. అయితే ఇది ఒక ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న మూవీ అని, తనకు సూట్ అవ్వదని వెంకీ అభిప్రాయపడ్డారట. అంతేకాదు ఈ కథ బాలకృష్ణకు బాగా సరిపోతుందని వెంకటేష్ స్వయంగా సూచించారట. దాంతో ఈ కథ బాలకృష్ణ వద్దకు వెళ్లడం, ఆయన ఒకే చెప్పడంతో ‘సమరసింహా రెడ్డి’ సినిమా పట్టాలెక్కింది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.