Tollywood: హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్‌లో ఆ స్టార్ హీరోయిన్ హోర్డింగ్.. దెబ్బకు 40కు పైగా యాక్సిడెంట్లు

సినిమా ప్రమోషన్ల కోసం హీరోలు, హీరోయిన్ల హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తుంటారు. అలాగే పెద్ద పెద్ద పోస్టర్లు కూడా అతికిస్తుంటారు. అయితే ఒక హీరోయిన్ హోర్డింగ్ కారణంగా ఏకంగా 40 కు పైగా రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. దీంతో అధికారులు ఆ హీరోయిన్ హోర్డింగ్ ను తొలగించాల్సి వచ్చింది.

Tollywood: హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్‌లో ఆ స్టార్ హీరోయిన్ హోర్డింగ్.. దెబ్బకు 40కు పైగా యాక్సిడెంట్లు
Tollywood Actress

Updated on: Sep 05, 2025 | 12:28 PM

టాలీవుడ్ హీరోయిన్లలో ఈ అమ్మడిది ప్రత్యేక స్థానం. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, గోపీచంద్ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎన్నో మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించి విజయాలు సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది. అయితే ఒకప్పుడు ఈ అమ్మడి క్రేజ్ ఎలా ఉనిందంటే.. కేవలం రోడ్డుపై ఈ హీరోయిన్ హోర్డింగ్ చూసే చాలా మంది వాహన దారులు యాక్సిడెంట్ల బారిన పడ్డారు. అంతటి కళ్లు తిప్పుకోలేని అందం ఆమెది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 యాక్సిడెంట్లకు కారణమైన ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు త్వరలో ఘాటీ మూవీతో మనల్ని పలకరించనున్న అనుష్కా శెట్టి.

క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2009లో రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అల్లు అర్జున్, మంచు మనోజ్ ఈ మూవీలో హీరోలుగా నటించారు. అలాగే అనుష్క సరోజ అనే ఒక వేశ్య పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది. అయితే వేదం సినిమా రిలీజ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సినిమాలో అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న ఒక స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా వాడారు. హైదరాబాద్ లోని చాలా చోట్ల కూడా అనుష్క ఫొటోని హోర్డింగులుగా ఏర్పాటు చేశారు. పంజాగుట్ట సర్కిల్ లో కూడా అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట. దీంతో ఆ హోర్డింగ్ లో అనుష్కని చూస్తూ చాలా మంది వాహనదారులు యాక్సిడెంట్ల బారిన పడ్డారట. అలా ఏకంగా సుమారు 40 యాక్సిడెంట్ లు జరిగాయట. మరీ పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా అనుష్క హోర్డింగ్ చూస్తూ కళ్లు తిప్పుకోలేక ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టేవారట. ఇలా రోజు రోజుకు యాక్సిడెంట్స్ ఎక్కువవుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట. ఘాటీ సినిమా రిలీజ్ నేపథ్యంలో మరోసారి ఈ న్యూస్ బాగా నెట్టింట ట్రెండ్ అవుతోంది.

యాక్సిడెంట్లకు కారణమైన అనుష్క పోస్టర్ ఇదే..

Anushka Shetty Poster

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.