
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. సోనాలి బింద్రే, సిమ్రాన్, సాక్షి శివానంద్, ఆర్తి అగర్వాల్, రక్షిత, శ్రియ, త్రిష, ఇలియానా, కాజల్ అగర్వాల్, సమంత, శ్రుతి హాసన్, ప్రణీత, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, శ్రీలీల తదితర హీరోయన్లు మహేష్ తో రొమాన్స్ చేశారు. ప్రీతి జింటా, బిపాసా బసు, అమీషా పటేల్, కృతిసనన్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లు కూడా మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ బ్యూటీ కూడా సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయనుంది. అయితే గతంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఓ అందాల తార మహేష్ బాబు కి ఓ సినిమాలో అక్కగా మరో సినిమాలో తల్లిగా కూడా చేసింది. సాధారణంగా పెళ్లి, పిల్లలు తర్వాత చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతారు. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తారు. ఈ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సినిమాల్లో నటించిన ఈ అందాల తార ఆ తర్వాత సహాయక నటిగా మెప్పించింది. ఇదే క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి అక్కగా, తల్లిగా నటించింది. ఆమె మరెవరో కాదు గీత కదంబి.
తమిళనాడుకు చెందిన గీత 1978 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. అదే సమయంలో 1990లో వచ్చిన బాలచంద్రుడు సినిమాలో మహేష్ బాబుకు అక్కగానూ నటించింది.
అయితే గీత 1997లో ఓ ఛార్టెర్డ్ అకౌంటెంట్ ను పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. ఆ తర్వాత మళ్లీ కొన్నేళ్లకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అలా 2003లో ఒక్కడు సినిమాలో మహేష్ కి తల్లి పాత్రలో నటించింది. దీని తర్వాత కూడా పలు సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది గీత. అయితే ప్రస్తుతం ఆమె మళ్లీ అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలైపోయిందని సమాచారం.
Actress Geetha
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.