
సాధారణంగా సినీరంగంలో ఏ కాంబినేషన్ ఎలా సెట్టవుతుందో అస్సలు ఊహించలేము. ఒక హీరోకు భార్యగా, ప్రేయసిగా కనిపించిన హీరోయిన్.. మరో హీరోకు మాత్రం చెల్లిగా, అక్కగా, వదినగా కనిపిస్తుంది. అయితే ఒక్కో జోడికి అభిమానుల్లో మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఓ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లల్లో న్యాచురల్ స్టార్ నాని కోడలిగా కనిపించింది. ఆ తర్వాత మరో హీరోకు భార్యగా కనిపించింది. కట్ చేస్తే.. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సీనియర్ హీరో సరసన నటించి భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో ఆమె పేరు మారుమోగుతుంది. ఇటీవలే చిన్న సినిమాతో థియేటర్లలోకి వచ్చి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.
ఐశ్వర్య రాజేశ్.. అచ్చ తెలుగమ్మాయి. ఒకప్పుడు తెలుగులో హీరోగా కొనసాగిన రాజేశ్ కూతురు. చిన్నప్పుడే సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయ్యింది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో అంతగా ఆఫర్స్ రాలేదు. రాజేంద్ర ప్రసాద్ నటించిన రాంబంటు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. 2010లో ఇంద్రసేనా మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపు 9 ఏళ్లు వరుస సినిమాల్లో నటిస్తూ టాప్ నటిగా మారింది.
ఆ తర్వాత 2019లో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో హీరో భార్యగా కనిపించింది. ఈ సినిమాలో సహజ నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత టక్ జగదీష్ సినిమాలో నాని మేనకోడలిగా నటించింది. కానీ ఈ రెండు చిత్రాల తర్వాత ఐశ్వర్యకు సరైన ఆఫర్స్ రాలేదు. సాయి ధరమ్ తేజ్ జోడిగా రిపబ్లిక్ మూవీలో కనిపించినప్పటికీ ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇటీవలే వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో భాగ్యం పాత్రలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..