Tollywood: ఒకప్పుడు వీధుల్లో పెన్నులు అమ్మాడు.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతున్న వారిలో చాలా మంది చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వారే. పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు చేసిన వారే. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఏలుతోన్న ఈ ప్రముఖ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

Tollywood: ఒకప్పుడు వీధుల్లో పెన్నులు అమ్మాడు.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు.. ఎవరో తెలుసా?
Tollywood Actor

Updated on: Jun 26, 2025 | 8:12 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ పేద కుటుంబంలో ఇతను జన్మించాడు. తండ్రి ఓ ప్రముఖ కంపెనీలో ఆపరేటర్‌గా వర్క్ చేస్తుండటంతో ముంబైలోనే ఎక్కువగా పెరిగాడు. అయితే చదువుపై పెద్దగా దృష్టి సారించలేకపోయాడు. తండ్రికి వచ్చే జీతం కూడా సరిపోకపోవడంతో 10 ఏళ్ల వయసులోనే చిన్న చిన్న పనులు చేయడం మొదలు పెట్టాడు. ఉదయం స్కూల్‌కి వెళ్తూ మధ్యాహ్నం పనికి వెళ్లేవాడు. ఇదే క్రమంలో వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్ల ముందు పల్లీ బఠానీలు అమ్ముకునే వ్యక్తి దగ్గర పని చేశాడు. అలాగే వీధుల్లో తిరుగుతూ పెన్నులు అమ్మాడు. అలా చేయవగా వచ్చే కూలీ డబ్బులతో తండ్రికి అండగా నిలిచాడు. అయితే ఇదే సమయంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి తన మిమిక్రీ ట్యాలెంట్ ను ఉపయోగించేవాడు. ఇదే ఈ నటుడి జీవితాన్ని మార్చేసింది. తర్వాత తండ్రి పనిచేస్తోన్న కంపెనీలో చేరి అక్కడ కూడా మిమిక్రీ చేయడం మొదలు పెట్టాడు. దీంతో చాలామంది నాటకాల్లో నటించాలని సూచించడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. నాటకాల్లో దాదాపుగా అందరూ సినిమా స్టార్ల సెలబ్రిటీల వాయిస్ ను మిమిక్రీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదే క్రమంలో ఓ స్టార్ హీరో ఓ నాటక ప్రదర్శన సందర్భంలో ఇతని పర్ఫార్మెన్స్‌ మెచ్చుకుని సినిమా అవకాశం ఇచ్చాడు. ఇలా మొదలైన అతని సినిమా ప్రస్థానం ఆ తర్వాత అప్రతిహతంగా సాగింది.
నాటి ధర్మేంద్ర నుంచి నేటి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితర ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. తన అద్భుతమైన నటనతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పటికీ తన కామెడీతో అందరి ముఖాల్లో నవ్వులు నింపుతోన్న ఆ స్టార్ కమెడియన్ మరెవరో కాదు జానీ లీవర్.

ఈ కమెడియన్ ఎక్కువగా హిందీ సినిమాల్లో కనిపిస్తునప్పటికీ తెలుగు వాడే. ‘బాజీగర్‌’, ‘తేజాబ్‌’, ‘ఖిలాడీ’, ‘బాజీగర్‌’, ‘కరణ్‌ అర్జున్‌’, ‘రాజా హిందుస్తానీ’, ‘బాస్‌’, ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’, ‘హౌస్‌ఫుల్‌’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇక తెలుగులో క్రిమినల్, కొంచెం కొత్తగా వంటి సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ఇప్పటి వరకు సుమారు 350 కు పైగా సినిమాల్లో నటించాడు జానీ లీవర్. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించి అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కూతురితో జానీ లీవర్..

కాగా జానీ లివర్ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ అతని కుమార్తె జేమీ లివర్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే హిందీలో హౌజ్‌ఫుల్‌ 4’, ‘బూత్‌ పోలీస్‌’ లాంటి చిత్రాలతో క్రేజ్ దక్కించుకుందీ అందాల తార. ఇక గతేడాది విడుదలైన ‘ఆ ఒక్కటీ అడక్కు’తో టాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది జేమీ. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి