AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ముంబైలో ల్యాండైన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ పుస్తకమేంటో తెలుసా? వీడియో

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మధ్యలో 'వార్ 2' సినిమాలోని ఒక పాట షూటింగ్‌లో పాల్గొనడానికి ముంబై వెళ్లాడు యంగ్ టైగర్. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఒక ఆసక్తికరమైన పుస్తకం కనిపించింది.

Jr NTR: ముంబైలో ల్యాండైన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ పుస్తకమేంటో తెలుసా? వీడియో
Jr NTR
Basha Shek
|

Updated on: Jun 26, 2025 | 8:45 PM

Share

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్, అద్దిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అలాగే ఒక స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు, జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా ఫైనల్ షూట్ లోనూ పాల్గొంటున్నాడు. హృతిక్ రోషన్ గాయం కారణంగా ‘వార్ 2’ చిత్రంలోని పాట షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే అది తిరిగి ప్రారంభమైంది. ఇందుకోసమే జూనియర్ ఎన్టీఆర్ ముంబైకి వెళ్లాడు. అయితే ముంబైలో ఎన్టీఆర్ చేతిలో ఒక ఆసక్తికరమైన పుస్తకం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చేతిలో ఉన్న పుస్తకం పేరు ‘మురుగ: లార్డ్ ఆఫ్ వార్, గాడ్ ఆఫ్ విజ్డమ్’ తెలివికి, యుద్దానికి దేవుడు అనేది ఈ బుక్ ట్యాగ్ లైన్. ఆనంద్ బాలసుబ్రహ్మణ్యన్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో సుబ్రమణ్య స్వామి జననం, చరిత్ర, ఆయన గురించి అన్నివివరాలు ఉంటాయి. అయితే ఎన్టీఆర్ చేతిలో ఈ పుస్తకం ఉండడానికి ఓ ప్రత్యేక కారణముంది.

కాగా ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడని నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ తో చేయాల్సిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథను ఎన్టీఆర్ తో చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో కాబట్టి ఇప్పట్నుంచే త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతున్నాడని, అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన బుక్ చదువుతున్నాడని సినీ అభిమానులు, నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

చేతిలో మురుగన్ పుసక్తంతో ఎన్టీఆర్.. వీడియో..

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ తో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను తెరకెక్కించనున్నాడు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది. అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి చేసి ఉంటాడు. అయితే ‘దేవర 2’ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఖచ్చితంగా తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తయిన తర్వాతే ‘దేవర 2’ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us