AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silk Smitha: సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?

సిల్క్ స్మితను చూస్తే చాలు చాలామంది ప్రేక్షకులను తెలియని మైకం కమ్మేస్తుంది. ఆమె కళ్లలో ఏదో నిషా ఉంటుంది. ఆమె అంటే అప్పటి యువతకు పిచ్చి, వ్యామోహం.

Silk Smitha: సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
Silk Smitha
Ram Naramaneni
|

Updated on: Feb 08, 2023 | 3:18 PM

Share

మత్తెక్కించే కళ్లు ఆమెవి. కుర్రాళ్ల హృదయాలను ఆకర్షించే అయస్కాంతం ఆమె. 1980 దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపేసిన ఐటెం బాంబ్ సిల్క్ స్మిత. ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన విజయలక్ష్మి అనే అమ్మాయి.. సిల్క్ స్మితగా మారి సిల్వర్ స్క్రీన్‌పై మేజిక్ చేసింది. కొన్నిసార్లు సిల్క్ డేట్స్ తీసుకున్న తర్వాతే దర్శకులు హీరోలకు కథ చెప్పేవారంటే అతిశయోక్తి కాదు. నటన, అందంతో పాటు తన డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది సిల్క్. ఆమె నర్తించిన “బావలు సయ్యా, మరదలు సయ్యా” సాంగ్ ఇప్పటికీ ఓ సెన్సేషన్.

1996 సెప్టెంబర్ 23 న, స్మిత జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆమె బలవన్మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆమెని చంపేశారు అనే వారు కూడా ఉన్నారు. ప్రేమలో విఫలమై సూసైడ్ చేసుకుందని.. సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టి నష్టపోయిందని.. ఆల్కాహాల్ ఆమెను కుంగదీసిందని ఇప్పటికీ రకరకాలుగా చెప్పుకుంటారు. అసలు నిజం ఏంటన్నది ఆ ప్రకృతికే తెలియాలి.

అయితే సిల్క్ స్మిత విషయంలో తమిళ అభిమానుల తీరు విభిన్నంగా ఉండేది. ఒక కిళ్ళీ తెచ్చుకొని ఆమెను కొరికి ఇమ్మని తెగ బ్రతిమాలుకునేవారు. అప్పట్లో అదో ట్రెండ్. 1984లో ఒకసారి షూట్ బ్రేక్‌లో యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని సిల్క్‌ను పిలిచారట. సగం కొరికిన యాపిల్‌ను ఆమె అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ కొరికిన యాపిల్‌ను ఆమె మేకప్‌మ్యాన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు పోటీపడి 26 వేలకు కొనుక్కున్నారట. అది సిల్క్ అంటే. ఆమె అందానికి, బాడీకి ఎంత క్రేజ్ ఉంది.. కానీ ఆమె చనిపోయి.. ఆస్పత్రిలో నిర్జీవంగా ఉన్నప్పుడు… ఓ సాధారణ శవంలా స్ట్రెచర్‌పై పడుకోబెట్టారట. అప్పుడు నటి అనురాధ అక్కడికి వెళ్లగా.. సిల్క్‌ డెడ్‌బాడీపై ఈగలు వాలడం చూసి.. దు:ఖం ఆగలేదట.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.