కళాతపస్వి కె. విశ్వనాథ్ తెలుగు తెరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. ఆయన కలం నుంచి రాలిన సినిమాలు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్స్. మెగాస్టార్ చిరంజీవితో స్వయం కృషి, ఆపద్భాంధవుడు… వెంకటేశ్‌తో స్వర్ణకమలం.. కమల్ హాసన్‌తో స్వాతిముత్యం వంటి అపురూప చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా.. నటుడిగానూ సినీ ప్రియుల మన్ననలు అందుకున్నారు. తండ్రిగా… కుటుంబ పెద్దగా.. తప్పులు చేస్తే మందలిచ్చే తాతయ్యగా ఆయన వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించారు. దాదాపు 30 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన విశ్వనాథ్ పోషించారు. ఎంతోమంది దిగ్గజ నటీనటులతో కలిసి పనిచేసిన ఆయనకు… లెజండరీ నటి తెలుగు ప్రేక్షకుల గయ్యాలి అత్త సూర్యకాంతం ఓ టైటిల్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
సెట్లో మెగాఫోన్ పట్టిన తర్వాత ఆయన ఒంటిపై కచ్చితంగా ఖాకీ డ్రెస్ ఉండాల్సిందే. ఇందుకు పెద్ద కథే ఉందన్నారు విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా ఉండి దర్శకుడిగా మారిన తర్వాత.. ఆ తలబిరుసు తనకు రావొద్దని ఆ డ్రెస్ ధరించేవారట. తన సినిమా కోసం పనిచేసే కార్మికులందరూ ఖాకీ దుస్తులు ధరించేవారని.. వారిలో తాను ఒకరు అని ప్రతిక్షణం గుర్తుచేసకోవడానికి.. దర్శకుడు అనే గర్వం రాకూడదని తాను ఇలా డ్రెస్ వేసుకునేవాడినని చెప్పుకొచ్చారు.
మా ఆర్ట్ డైరెక్టర్ కు తన డ్రెస్ నచ్చేది కాదని ఆఅన్నారు. ‘మొదటి సినిమా సరిగా ఆడకపోతే.. వెంటనే టాక్సీ డ్రైవరుగా మారిపోతా. అప్పుడు కుట్టించుకోవడానికి వీలు ఉంటుందో లేదో.. ఓ జత రెడీ ఉన్నట్టుంటుంది’ అని చెప్పా! అది దొంగ మాటే అయినా.. అందులో కొంత నిజం లేకపోలేదు. తొలి సినిమా రోజుల్లో చాలా భయం ఉండేదని అన్నారు. ఇక ఇదే డ్రెస్ ను ఆపాదించుకుని నటి సూర్యకాంతం తనకు ఓ టైటిల్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.
ఓ సినిమా షూటింగ్ సమయంలో నేను డైలాగ్ చెప్తున్నా వినకుండా బయటివాళ్లతో మాట్లాడుతున్నారు. రెండు సార్లు.. మూడు సార్లు చెప్తున్నాను.. అయినా ఏమిటో మాట్లాడుతున్నారు వేరేవాళ్లతో. దీంతో నేను కోప్పడ్డాను. నాకు కోసం వచ్చి ఎందుకోసం చెప్తున్నాను.. మాకేం పనిలేక చెప్తున్నానా? అని విసుక్కున్నాను. దీంతో ఆమె అబ్బో ఆయన కమాండర్ అండ్ చీఫ్ అని టైటిల్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.