
తెలుగు తెరపై అద్భుతమైన కామెడీతో ఆకట్టుకున్న నటుల్లో ఏవీఎస్ ఒకరు. ఈయన అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. తనదైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో ఆయన పాత్రను పండించేవారు. ఆడియెన్స్‌కు నవ్వులు పంచేవారు. తొలుత తెనాలిలో పౌరోహిత్యం చేసిన ఏవీఎస్… ఆ తరువాత విజయవాడలో విలేఖరిగా పనిచేశారు. ఆ సమయంలో ఆర్ధికంగా చాలా కష్టాలే ఎదుర్కొన్నారు. తినడానికి డబ్బుల లేక ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఏవీఎస్. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సహాయ పాత్రల్లో మెప్పించారు. దాదాపు 750 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల్లో తన టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.
మాయలోడు, ఘటోత్కచుడు, యమలీల, సిసింద్రీ, ఆవిడా మా ఆవిడే, మావిడాకులు, జయం మనదేరా, అదిరిందయ్యా చంద్రం, వెంకీ, బెండు అప్పారావు, యమగోల మళ్ళీ మొదలైంది, బంగారం, శ్రీరామదాసు, రాధాగోపాళం, సంక్రాంతి, కాశి ఇలా ఎన్నో సినిమాలలో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే చేతినిండా సినిమాలు.. నటుడిగా వెండితెరపై సందడి చేస్తూ ఎంతో సరదాగా కనిపించిన ఏవీఎస్.. అనారోగ్యం కారణంగా 2013లో మరణించారు. ఆయన మరణం తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తీరని లోటు. ఇప్పటికీ ఆయన లేని లోటు కనిపిస్తే ఉంటుంది.
కాగా ఏవీఎస్ కుటుంబం గురించి చాలా తక్కువ మందకి తెలుసు. కానీ ఆయన కూతురు, అల్లుడు కూడా నటీనటులే. ముఖ్యంగా తెలుగు ఫ్యామిలీ అడియన్స్‌కు చాలా సుపరిచితమైనవారే. కానీ వారిద్దరూ కమెడియన్ ఏవీఎస్ కూతురు, అల్లుడు అని చాలా మందికి తెలియకపోవచ్చు. ఏవీఎస్ కూతురు శ్రీ ప్రశాంతి ప్రస్తుతం బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం చాలా సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. ఏవీఎస్ కూతురు ప్రశాంతి బుల్లితెర నటుడు శ్రీనివాస్ ను వివాహం చేసుకుంది. శ్రీనివాస్ అలియాస్ యాక్టర్ చింటు తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాలు, సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కనిపించారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఈయన ఎక్కువగా రవిబాబు మూవీస్‌లో కనిపించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.