
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. అతను చివరి గా అమరన్ అనే సూపర్ హిట్ మూవీలో కనిపించాడు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. శత్రువల కాల్పుల్లో చనిపోయిన అమర జవాన్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గత దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే కమర్షియల్ పరంగానూ ఈ మూవీకి మంచి ఆదరణ లభించడం గమనార్హం. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. అమరన్ సినిమా తర్వాత, శివకార్తికేయన్ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్‌తో జతకట్టాడు. శివకార్తికేయన్ నటిస్తోన్న ఈ 23వ చిత్రానికి ‘మదరాసి’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా మొదటి సింగిల్ వీడియో ఇటీవలే విడుదలై అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చడం గమనార్హం. సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
దీని తరువాత సుధ కొంగరతో ఓ సినిమా చేయనున్నాడు శివకార్తికేయన్. పరాశక్తి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ తో పాటు నటులు రవి మోహన్, అథర్వ మురళి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
సినిమాల సంగతి పక్కన పెడతే.. శివ కార్తికేయన్ ఇన్‌స్టాగ్రామ్ లో సుమారు 8.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు. శివ కార్తికేయన్ ఇన్ స్టా గ్రామ్ లో తన భార్య ఆర్తి రవిని మాత్రమే అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి