Poonam Pandey Death: పూనమ్ పాండే నటించిన తెలుగు సినిమా ఏదో తెలుసా.?
నిన్నమొన్నటి వరకు బాలీవుడ్ లో జరిగిన పలు ఈవెంట్స్ లో నవ్వుతూ కనిపించింది పూనమ్. కానీ ఇంతలోనే ఆమె క్యాన్సర్ కారణంగా మరణించిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ఉదయం ఆమె గర్భాశయ క్యాన్సర్ తో కన్నుమూసిందని ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆమె మేనేజర్స్ తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.

ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే పూనమ్ పాండే కన్నుమూశారని వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బాలీవుడ్ లో పలు సినిమాతో మెప్పించిన పూనమ్ పాండే సడన్ గా మరణించారు అని వైరల్ అవుతుంది. ఈ వార్తలు ఇప్పుడు చక్కర్లు కొట్టడంతో ఆమె అభిమానులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నమొన్నటి వరకు బాలీవుడ్ లో జరిగిన పలు ఈవెంట్స్ లో నవ్వుతూ కనిపించింది పూనమ్. కానీ ఇంతలోనే ఆమె క్యాన్సర్ కారణంగా మరణించిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న పూనమ్ గర్భాశయ క్యాన్సర్ తో కన్నుమూసిందని ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో మేనేజర్స్ తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.
పూనమ్ పాండే ఫిబ్రవరి 1 రాత్రి మరణించినట్లు తెలుస్తోంది. గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతూ పూనమ్ మరణించిందని ఈ పోస్ట్ లో రాసుకొచ్చారు. పూనమ్ పాండే కాన్పూర్ లోని తన ఇంట్లో కన్నుమూసింది. పూనమ్ చివరిగా కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ షో లాక్ అప్‌లో కనిపించింది. ఈ షోలో పూనమ్ బాగా నచ్చేసింది. 2013లో నషా సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఈ సినిమాలో బోల్డ్ గా నటించి మెప్పించింది. ఇక తెలుగులో మాలిని అండ్ కో అనే సినిమాలో నటించింది పూనమ్ పాండే. 2015లో వచ్చిన ఈ సినిమాలో నటుడు సామ్రాట్ హీరోగా నటించాడు. ఈ సినిమా రొమాంటి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఆశించిన స్థాయిలో ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ పూనమ్ గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా ఎక్కువ సినిమాల్లో నటించలేదు పూనమ్. ఇక ఇప్పుడు పూనమ్ మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పూనమ్ పాండే మూడు రోజుల క్రితం షేర్ చేసిన పోస్ట్..
View this post on Instagram
పూనమ్ పాండే ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




