Keerthy Suresh: లిప్ కిస్ ఇష్టంలేక ఆ హీరో సినిమాకు కీర్తిసురేష్ నో చెప్పిందట..

|

Feb 16, 2024 | 3:29 PM

యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజా సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది కీర్తి. ఆతర్వాత ఈ బ్యూటీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

Keerthy Suresh: లిప్ కిస్ ఇష్టంలేక ఆ హీరో సినిమాకు కీర్తిసురేష్ నో చెప్పిందట..
Keerthy Suresh
Follow us on

టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న భామల్లో కీర్తిసురేష్ ఒకరు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు వచ్చిన ఈ చిన్నది తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజా సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది కీర్తి. ఆతర్వాత ఈ బ్యూటీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. తెలుగు, తమిళ్ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది కీర్తిసురేష్.

ఇదిలా ఉంటే ఓ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉందన్న కారణంగా కీర్తిసురేష్ ఓ యంగ్ హీరో మూవీ ఛాన్స్ ను వదులుకుందట. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కీర్తిసురేష్ మొదటి నుంచి గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటుంది. ఇటీవలే కొంత హద్దులు చెరిపేరుకొని గ్లామర్ షో చేస్తుంది. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది .

అయితే ముద్దు సీన్ లో నటించడం ఇష్టం లేక ఓ యంగ్ హీరో మూవీని రిజక్ట్ చేసిందట కీర్తి. కీర్తిసురేష్ కెరీర్ స్టార్టింగ్ లో నితిన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట. ఆ సమయంలో ఈ చిన్నదానికి అది పెద్ద ఆఫర్. అయితే ఆ సినిమాలో లిప్ కిస్ సీన్స్ ఉన్న సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాకు నో చెప్పిందట. నితిన్ తో నటించడం ఇష్టమే కానీ లిప్ లాక్ సీన్స్ వల్లే ఆ సినిమాను వద్దన్నదట. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి రంగ్ దే అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం కీర్తిసురేష్ తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తుంది.

కీర్తిసురేష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

కీర్తిసురేష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.