కత్తెర పెడితే కాసులే.. ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు హెయిర్ కటింగ్ చేసేది ఇతనే.. ఫీజు ఎంతంటే?

|

Mar 23, 2025 | 11:21 AM

సాధారణంగా ఒక సెలూన్‌ షాప్‌లో ఒక మనిషి హెయిర్‌ కటింగ్‌కు రూ.150 తీసుకుంటారు. ఇక మెట్రో నగరాల్లోని లగ్జరీ సెలూన్లలో అయితే మహా రూ.500 తీసుకుంటారు. ఇంకొన్ని చోట్ల ఇంకాస్త ఎక్కువగానూ ఉండవచ్చు. కానీ ఈ హెయిర్ స్టైలిస్ట్ ఫీజు తెలిస్తే ముక్కు మీద వేలేసుకుంటారు.

కత్తెర పెడితే కాసులే.. ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు హెయిర్ కటింగ్ చేసేది ఇతనే.. ఫీజు ఎంతంటే?
Aalim Hakim
Follow us on

ఆలీమ్‌ హకీమ్‌.. ప్రస్తుతం ఇండియాలోనే ది మోస్ట్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్. ఈయన కస్టమర్లంతా ఫేమస్ సెలబ్రిటీలే. అందులోనూ సినీ, క్రీడా ప్రముఖులే హకీమ్ దగ్గరకు ఎక్కువగా వస్తుంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, కోలీవుడ్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌,విజయ్‌ సేతుపతి, అలాగే మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, యుజువేంద్ర చాహల్ తదతర క్రికెట్ స్టార్లందూ ఈ హెయిర్ స్టైలిస్ట్ దక్కరే కటింగ్ చేయించుకుంటారు. ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్‌స్టర్‌గా పని చేస్తోన్నది ఆలీమ్‌ హకీమే. కాగా ఇతను మొదట హాలీవుడ్‌ హెయిర్‌స్టర్‌. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే జస్ట్ రూ. 20 మాత్రమే తీసుకనే వారట. అయితే ఆ తర్వాత తన పనితనం బాగుండడంతో రోజు రోజుకీ కస్టమర్లు పెరిగిపోయారట. సెలబ్రిటీలు సైతం హకీమ్ దగ్గరకు క్యూ కట్టేవారట. దీంతో ఆయన కూడా తన హెయిర్ కట్ ఫీజుఉ అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయాడట.

 

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆలీమ్ హకీమ్ ఒక్కో హెయిర్ కటింగ్ కు మినిమమ్ లక్ష రూపాయలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ఇది కూడా మినిమమ్‌ ధర మాత్రమేనట.. అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్‌ చేస్తారని సమాచారం.

రామ్ చరణ్ ఆర్ సీ 16 మూవీ సెట్ లో ఆలీమ్ హకీమ్..

సెలబ్రిటీతో పాటు పలు సినిమాలకు కూడా హాలీమ్ అకీమ్ పని చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలి సినిమాకు ఆయన వర్క్ చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ ఆర్ సీ 16 మూవీకి కూడా హెయిర్ స్టర్ గా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోని పలు క్రేజీ ప్రాజెక్టులకు హకీమ్ హెయిర్ స్టర్ గా పని చేస్తున్నారు.

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..