AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani : నానితో ఆ సీన్ చేయడానికి కండీషన్ పెట్టిన హీరోయిన్.. దెబ్బకు అంతా షాక్..

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. దసరా లాంటి మాస్ మసాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని.. ఆ వెంటనే హాయ్ నాన్న అంటూ సాఫ్ట్ స్టోరీతో హిట్ కొట్టాడు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ నటుడిగా అంచలంచలుగా ఎదుగుతున్నాడు నాని. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ.. ప్రేక్షకులకు కూడా నాని నటన చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు

Nani : నానితో ఆ సీన్ చేయడానికి కండీషన్ పెట్టిన హీరోయిన్.. దెబ్బకు అంతా షాక్..
Nani
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2024 | 4:26 PM

Share

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు నాని. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. దసరా లాంటి మాస్ మసాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని.. ఆ వెంటనే హాయ్ నాన్న అంటూ సాఫ్ట్ స్టోరీతో హిట్ కొట్టాడు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ నటుడిగా అంచలంచలుగా ఎదుగుతున్నాడు నాని. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ.. ప్రేక్షకులకు కూడా నాని నటన చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. నాని సినిమాలు చాలా క్లిన్ గా ఉంటాయి. ఎక్కువ బూతులు, బోల్డ్ , రొమాంటిక్ సీన్స్ లేకుండా నీట్ గా ఉంటాయి. నానితో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోయిన్ ఆసక్తి చూపిస్తారు. తాజాగా ఓ హీరోయిన్ నాని సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

నాని సినిమాలో ఓ సీన్ లో నటించడానికి షాకింగ్ కండీషన్ పెట్టిందట ఓ ముద్దుగుమ్మ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? కృతి శెట్టి. నాని సినిమాల్లోనూ ఈ మధ్య లిప్ లాక్ సీన్స్ కనిపిస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కృతిశెట్టితో నాని లిప్ లాక్ సీన్ ఉంటుంది. అలాగే హాయ్ నాన్న సినిమాలోనూ మృణాల్ తో ఓ లిప్ లాక్ సీన్ ఉంటుంది. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమాలో లిప్ కిస్ సీన్ సమయంలో కృతి శెట్టి ఓ కండీషన్ పెట్టిందట.

ఇది కూడా చదవండి : ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి.. ఇద్దరమ్మాయిల రచ్చ.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ సినిమా

ముద్దు సీన్ లో నటించే సమయంలో తన చుట్టూ ఎవ్వరూ ఉండకూడదు అని చెప్పిందట. డైరెక్టర్ కెమెరా మెన్ తప్ప తన చుట్టూ ఇంకెవరూ ఉండకూడదు అని కండిషన్ పెట్టిందట. చుట్టూ జనం ఉంటే ఆ సీన్ చేయాలను అని చెప్పడంతో దర్శకుడు ఆమె కంఫర్ట్ కోసం అక్కడ ఎవరు లేకుండా చేశారట. ఇక లిప్ లాక్ సీన్స్ పై గతంలో ఓ ఇంటర్వ్యూలో నాని అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ సీన్స్ ఉంటున్నాయి మీరే కావాలని రాయిస్తున్నారా.? లేక డైరెక్టర్స్ కథలో అలా రాస్తున్నారా.? అని అడిగిన ప్రశ్నకు నాని దసరా సినిమాలో కిస్ సీన్ లేదు, అంటే సుందరానికి అనే సినిమాలోనూ లేదు.. మరి మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అర్ధం కావడం లేదు అని చెప్పాడు నాని. ఇక నాని సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే హిట్ 3 సినిమాలోనూ నటిస్తున్నాడు నాని.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..