Tollywood: ఆ స్టార్ హీరోయిన్‌తో ముద్దు సీన్.. ఎగిరిగంతేసిన హీరోకి దిమ్మతిరిగే షాక్.. జరిగిందిదే

ఓ హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్ చేస్తుండగా.. స్టార్ హీరోకు చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి.? ఆ స్టోరీ ఏంటి.? ఎవరా స్టార్ హీరో అని తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి. ఆ వివరాలు ఇలా.. చూసేయండి మరి.

Tollywood: ఆ స్టార్ హీరోయిన్‌తో ముద్దు సీన్.. ఎగిరిగంతేసిన హీరోకి దిమ్మతిరిగే షాక్.. జరిగిందిదే
Tollywood 1

Updated on: Aug 17, 2025 | 1:25 PM

సినీ ఇండస్ట్రీలో పలు షాకింగ్ ఘటనలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. హీరోకు చేదు అనుభవం ఎదురైన ఓ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ ఘటన 1997లో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా షూటింగ్‌లో జరిగింది. ఆ సినిమాలోని ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు.. హీరోయిన్ నోటి దుర్వాసనతో దెబ్బకు షాకయ్యాడు ఒక హీరో. మనం మాట్లాడుకోబోయే బాలీవుడ్ హీరో మరెవరో కాదు బాబీ డియోల్. 1997లో ‘గుప్త్’ అనే సినిమా చేసిన బాబీ డియోల్.. ఆ సమయంలో హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్ చేస్తుండగా.. చేదు అనుభవాన్ని ఎదుర్కున్నాడు.

ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటుడు మాట్లాడుతూ.. 1997 చిత్రం ‘గుప్త్’లో బాబీ డియాల్ సరసన కాజోల్, మనీషా కొయిరాలా నటించారు. బాబీ డియాల్ చెప్పిన ప్రకారం.. మనీషా కోయిరాలాతో ‘గుప్త్’ చిత్రంలో ‘బెచానియన్’ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు.. ఇద్దరూ దగ్గరగా వచ్చి.. చిన్నపాటి రొమాన్స్ చేయాల్సి ఉంది. ఆ షాట్ కోసం ప్రయత్నించగా.. హీరోయిన్ మనీషా కోయిరాలా నోటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. పచ్చి ఉల్లిపాయల వాసన తీవ్రంగా రావడంతో.. ఆ రొమాంటిక్ సీన్ చేయడంలో హీరో చాలా ఇబ్బందిపడ్డాడు. షూటింగ్‌కు ముందు మనీషా పచ్చి ఉల్లిపాయలతో చనా చాట్ తిన్నది. దీని కారణంగా, ఈ రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రీకరించడం ఆమెకు కూడా చాలా కష్టమైంది. అయితే ఆ తర్వాత పలు రీ-టేక్స్ తీసుకున్న అనంతరం సీన్ పూర్తి అయింది. ఆ సన్నివేశాన్ని తాను చేయడం చాలా అద్భుతం అని బాబీ డియోల్ తెలిపాడు. కాగా, బాబీ డియాల్‌కి ‘గుప్త్’ రెండో చిత్రం కాగా.. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 18.23 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.