Amaran: ‘అమరన్‌’ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? శివకార్తికేయన్ కంటే ముందు అతనికే ఛాన్స్

గతేడాది రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో అమరన్ ఒకటి. శివకార్తికేయన్, సాయి పల్లవి ఈ మూవీలో జంటగా నటించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే ఈ మూవీలో ఓ టాలీవుడ్ హీరో నటించాల్సిందని సమాచారం

Amaran: అమరన్‌ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? శివకార్తికేయన్ కంటే ముందు అతనికే ఛాన్స్
Amaran Movie

Updated on: May 26, 2025 | 12:39 PM

గతేడాది దీపావళికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియా స్వామి ఈ బయోపిక్ ను తెరకెక్కించారు. ఆర్మీ మేజర్ పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ గా సాయి పల్లవి ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించింది. రాహుల్ బోస్, భువన్ అరోరా, శ్రీ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. దేశ భక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ ఆడియెన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు రూ. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే అమరన్ సినిమాలో కథానాయకుడిగా ముందుగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట. దర్శకుడు రాజ్ కుమార్ పెరియా స్వామి ఆ తెలుగు హీరోతోనే మూవీ చేయాలని భావించారట. కానీ ఆ టాలీవుడ్ స్టార్ హీరో అప్పటికే తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట. కనీసం అపాయిట్మెంట్ దొరకడం కూడా కష్టమైందట. దీంతో మరో ఛాయిస్ లేక శివ కార్తీకేయన్ ను అప్రోచ్ అయ్యారట. ఇలా అమరన్ సినిమాను మిస్ చేసుకున్న తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 కు ముందే ఈ సినిమా కథని బన్నీకి చెప్పాలని అనుకున్నాడు డైరెక్టర్. కానీ అల్లు అర్జున్ అపాయిట్మెంట్ దొరకడం అప్పట్లో కష్టమైందట. దీంతో హీరోను కూడా కలవలేకపోయాడట. ఇక ఆ తర్వాత బన్నీ పుష్ప 2లో బిజీ కావడంతో నేరుగా శివకార్తికేయన్ ను కలిశారట రాజ్ కుమార్. ఈ కథను విన్న వెంటనే అతను ఓకే చెప్పడంతో అమరన్ షూటింగ్ పట్టాలెక్కిందట.

ఇవి కూడా చదవండి

 

 అల్లు అర్జున్ AA 22  అనౌన్స్ మెంట్ గ్లింప్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.