
పై ఫొటోలో కృష్ణుడి గెటప్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో అయితే వెంకటేష్, రవితేజ, రాజశేఖర్, ప్రభాస్, బాలకృష్ణ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తమిళంలో అయితే ఈ అమ్మడి క్రేజ్ నెక్ట్స్ లెవెల్. ఈ బ్యూటీ అందానికి ఫిదా అయిన అభిమానులు అక్కడ ఆమెకు ఏకంగా గుడి కట్టేసి పూజలు చేశారు. అంతేకాదు.. ఒక అభిమాని ఏకంగా ఈ అందాల తారను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం పకడ్బందీగా కిడ్నాప్ ప్లాన్ కూడా వేశాడు. అయితే అదేమీ జరగకపోవడంతో సదరు హీరోయిన్ ఊపిరి పీల్చుకుంది. మరి అభిమాని చేతిలో కిడ్నాప్ కు గురైన ఆ హీరోయిన్ మరెవరో కాదు బొద్దుగుమ్మ నమిత. శనివారం (మే10) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో నమితకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో బిజీగా ఉంటోంది నమిత. 2020లో ఓ తమిళ సినిమాలో చివరిగా కనిపించిందీ అందాల తార. ఆ మధ్యన కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా పాల్గొంది. బీజేపీ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరింది. అలాగే అప్పుడప్పుడూ తమిళ రాజకీయాలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటుందీ అందాల తార.
2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది నమిత. ఈ జంటకు 2022లో కవల పిల్లలు జన్మించారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతోనే ఎక్కువగా గడిపేస్తుందీ అందాల తార. మరి చాలామందిలాగే ఈ ముద్దుగుమ్మ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.