
ఈ హీరోయిన్ 2012లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. తండ్రి ప్రముఖ దర్శకుడు కావడంతో ఈ అమ్మడికి సినిమా ఎంట్రీ సులభంగానే దొరికింది. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఆడిషన్స్ లోనే అవమానాలు ఎదుర్కొంది. అయినా వెనకడుగు వేయకుండా ప్రయత్నించింది. ఎలాగో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. కానీ నెపోటిజమ్ (బంధుప్రీతి) విమర్శలు ఎదుర్కొంది. కానీ ఈ విమర్శలకు తన యాక్టింగ్ ట్యాలెంట్ తో సమాధానం చెప్పిందీ అందాల తార. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని తనను ట్రోల్ చేస్తున్న వారికి సరైన కౌంటర్లు ఇచ్చింది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ నటించింది. తన నటనా ప్రతిభకు ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది. ఇప్పటివరకు దాదాపు 20 కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అందులో ఫ్లాప్ అయిన సినిమాలంటే కేవలం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలా ఉందీ ఈ స్టార్ హీరోయిన్ ట్రాక్ రికార్డు.
ఈ హీరోయిన్ కు 2022లో ఓ స్టార్ హీరోతో వివాహమైంది. ప్రస్తుతం ఒక కూతురు కూడా ఉంది. అయినా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా ఛాన్స్ ల పరంగా ప్రస్తుతం భారత దేశంలో బాగా డిమాండ్, క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ముందుంటుంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా అంతే. ప్రస్తుతం భారత దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న నటీమణుల్లో ముందుంటుందీ అందాల తార. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా ఎనలేజి క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజిగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఆర్‌ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్.
అలియా భట్ ఇప్పటివరకు దాదాపు 20 కు పైగా సినిమాల్లో హీరోయిన గా నటించింది. అందులో కళంక్, సడక్ 2, షాన్ దార్, జిగ్రా సినిమాలు మాత్రమే ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. మిగతా సినిమాలన్నీ కలెక్షన్ల పరంగా మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి