
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు వడ్డే నవీన్. 1997లో కోరుకున్న ప్రియుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా ‘పెళ్లి’ తోనే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాడు. ఇప్పుడు కూడా టీవీల్లో పెళ్లి సినిమా వస్తే చాలా మంది కన్నార్పకుండా చూస్తారు. ఇక ప్రియా ఓ ప్రియా, చెలికాడు, లవ్ స్టోరీ 1999, స్నేహితుడు, మనసిచ్చి చూడు, నా హృదయంలో నిదురించే చెలి, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, నా ఊపిరి వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ సినిమాల్లో నటించి మెప్పించాడు నవీన్. అయితే ఒకానొక సమయంలో నవీన్ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కొన్ని సినిమాల్లో విలన్ గానూ, సపోర్టింగ్ రోల్స్ లోనూ నటించాడు నవీన్. కాగా చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటన్నాడీ నటుడు. చివరిగా 2016లో అటాక్ సినిమాలో కనిపించాడు నవీన్.
సినిమాల సంగతి పక్కన పెడితే … నవీన్ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. నవీన్ నందమూరి కుటుంబ సభ్యులకు దగ్గరి బంధువు అవుతాడు. ఎన్టీ రామారావు కొడుకుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడీ నటుడు. పెళ్లికి ముందే వీరు ప్రేమలో ఉన్నారని, దీంతో ఎన్టీఆర్ సలహాతో వీరికి పెళ్లి చేశారట. అలా మొత్తానికి నందమూరి ఇంటికి అల్లుడయ్యాడు. నవీన్. అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బావ అయిపోయారన్నమాట.
కాగా పెళ్లైన కొన్నేళ్లకు నవీన్ తన భార్యతో విడిపోయాడు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కూడా తీసుకున్నారు. అక్కడితో చుట్టరికం తెగిపోయినప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులు, హీరోలతో నవీన్ స్నేహంగానే ఉంటారని అతని సన్నిహితులు చెబుతుంటారు. ఇక విడాకుల తర్వాత నవీన్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం భార్య, పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. గతేడాదే నవీన్ కొడుక్కి నిర్వహించిన పంచెకట్టు కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రెటీలందరూ హాజరయ్యారు.
What an incredible evening watching Devara in Los Angeles. Thank you to the @BeyondFest team and audience for giving me yet another cherished moment with your amazing applause… Much love always! pic.twitter.com/1WW3RyClCy
— Jr NTR (@tarak9999) September 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.