250కు పైగా సినిమాలు.. పెళ్లికాకుండానే తల్లైన టాలీవుడ్ తోప్ హీరోయిన్.. 54వయసులోనూ సింగిల్‌గానే

మనం మన హృదయాల్లో ప్రత్యేక స్థానం ఇచ్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన తారలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం సహయ నటీనటులుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు.

250కు పైగా సినిమాలు.. పెళ్లికాకుండానే తల్లైన టాలీవుడ్ తోప్ హీరోయిన్.. 54వయసులోనూ సింగిల్‌గానే
Tollywood

Updated on: Nov 06, 2025 | 8:52 AM

చిత్రపరిశ్రమలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఆమె అందానికి, అభినయానికి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోస్ సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుని..ఇప్పుడు ఇండస్ట్రీలో సహయ నటిగా రాణిస్తుంది.అప్పట్లో ఆమె అందానికి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు. అంతే కాదు ఆమె అభినయం ఓ అద్భుతమనే చెప్పాలి ఆమె తెర పై నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం.. స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది హృదయాలను దోచుకుంది ఆమె.. పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు.. 55 ఏళ్లు వచ్చినా కూడా.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

తండ్రి తోపు హీరో.. కూతురు మాత్రం మూడు సినిమాలకే కనిపించకుండా పోయింది.. ఆమె ఎవరంటే

పై ఫొటోలో ఉన్న కోల కళ్ళ కోమలి ఎవరో కాదు అలనాటి అందాల తార శోభన. అప్పట్లో ఎంతో మంది నటీమణులు స్టార్ హీరోలకు పోటీగా నటించి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించింది. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సొంతంగా క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తుంది.

నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు..!! బాబోయ్..ఒంటరిగా చూడకూడని సినిమా.. ఏకంగా మూడు ఓటీటీలో..

ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన శోభన చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.. కల్కి సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించింది. 54 సంవత్సరాల వయసులోనూ సింగిల్ గా ఉంటున్న ఆమె.. పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. శోభన ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఆడపిల్లను దత్తత తీసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది శోభన. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన నాట్యంను కెరీర్‌గా ఎంచుకుంది. చెన్నైలో స్కూల్ పెట్టి చాలా మందికి భరత నాట్యం నేర్పిస్తుంది శోభన.

Bigg Boss 9: అనుకున్నదే అయ్యింది. ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనే.?

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి