Dhamaka Movie: రవితేజ సూపర్ హిట్ ధమాకాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

|

Dec 29, 2022 | 5:51 PM

క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత వరుస గా ఫ్లాప్ లు అందుకున్నాడు. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు ధమాకా సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా వందకోట్ల వసూల్ వైపు పరుగులు పెడుతోంది.

Dhamaka Movie: రవితేజ సూపర్ హిట్ ధమాకాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Dhamaka
Follow us on

మాస్ మహారాజ రవి తేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా.. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత వరుస గా ఫ్లాప్ లు అందుకున్నాడు. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు ధమాకా సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా వందకోట్ల వసూల్ వైపు పరుగులు పెడుతోంది. మొదటి షో నుంచి హిట్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేక పోవడంతో ధమాకా సినిమా దూసుకుపోతోంది. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటించింది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. అయితే ఈ సినిమాలో హీరోగా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా..?

ధమాకా కథను ముందుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయాలనీ అనుకునారట.. త్రినాద్ రావు కథను చరణ్ కు చెప్పగా ఆయన రిజక్ట్ చేశాడని తెలుస్తోంది. చరణ్ రిజక్ట్ చేయడంతో ఈ కథను రవితేజకు వవినిపించాడట. ఆయన ఓకే చేయడంతో ధమాకా సినిమా పట్టాలెక్కింది.

ఇక చరణ్ ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అనుకున్నాడు. ఈ సినిమాతో పాటే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినా ఆఎఫెక్ట్ చరణ్ మీద పడలేదు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

Ram Charan