Sreeleela: ఆ సినిమా ఆఫర్‌ను శ్రీలీల రిజక్ట్ చేసిందట.. కారణం ఏంటంటే

|

Jun 09, 2023 | 9:56 AM

ఈ చిన్నది శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Sreeleela: ఆ సినిమా ఆఫర్‌ను శ్రీలీల రిజక్ట్ చేసిందట.. కారణం ఏంటంటే
Sreeleela
Follow us on

హీరోయిన్ గా ఎదగాలంటే అందం అభినయంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటుంటారు. ఇప్పుడు ఆ అదృష్టంతోనే హీరోయిన్ గా రాణిస్తోన్న ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ చిన్నది శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పెళ్లి సందడి సినిమాతర్వాత ధమాకా సినిమాతో రవితేజకు జోడీగా నటించి మరో హిట్ హను తన ఖాతాలో వేసుకుంది. ఆ వరుసగా రెండు సూపర్ హిట్స్ అనుకోవడంతో ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి.

యంగ్ హీరోల సినిమాలే కాదు స్టార్ హీరోల సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంది ఈ భామ. వీటిలో ముఖ్యంగా చెప్పాల్సింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గురించి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు కన్నడలో సినిమాలు చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ .. దూసుకుపోతున్న ఈ భామకు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి అఫర్ వచ్చిందట. అయితే ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట శ్రీలీల. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుండటంతో ఆమె డైరీ ఖాళీగా లేదు. ఇక్కడ అరడజను కు పైగా సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. దాంతో కన్నడ ఆఫర్ ను రిజక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది.