‘అయ్యగారే నెంబర్ 1’.. ‘అయ్యగారే ఫస్టు’.. అఖిల్ అక్కినేనికి ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘అఖిల్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఈ అక్కినేని నటవారసుడు.. తన నటన, లుక్స్, డ్యాన్స్ పరంగా మంచి మార్కులు దక్కించుకున్నాడు. కానీ అఖిల్‌కి మాత్రం ఇప్పటివరకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ తప్ప.. ఆ రేంజ్‌లో మూవీ మరొకటి రాలేదు. ఇక ఎలాగైనా సూపర్ హిట్ దక్కించుకోవాలన్న కసితో అఖిల్ రెండేళ్లు కష్టపడి చేసిన సినిమా ‘ఏజెంట్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, లుక్స్ పరంగా అఖిల్‌కు మంచి మార్కులు దక్కినా.. సినిమా మాత్రం కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది.
ఇదిలా ఉంటే.. అఖిల్ తన తర్వాతి ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేస్తారన్న దానిపై తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ అక్కినేని వారసుడు తన తర్వాతి సినిమాను స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో చేస్తారన్నది ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోన్న సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ గనుక వర్క్‌ఔట్ అయ్యి.. ప్రాజెక్ట్ పట్టాలెక్కితే.. సినిమాపై భారీ అంచనాలు ఉండొచ్చు. కాగా, వంశీ పైడిపల్లి ఇటీవల దళపతి విజయ్‌తో కలిసి ‘వారసుడు’ సినిమా తీసి సూపర్ హిట్ దక్కించుకున్న విషయం విదితమే.
Akhil Akkineni’s next film will be with Dir Vamshi Paidipally!
— Christopher Kanagaraj (@Chrissuccess) April 29, 2023