
బాలీవుడ్ లో రీసెండ్ డేస్ లో దుమ్మురేపిన సినిమా ధురంధర్. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ కన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ధురంధర్ సినిమా మాత్రం ప్రాంతీయ భాషా సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ లేకపోయినా, కథలో బలం ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపించింది. ఈ సినిమా సాధించిన వసూళ్లు చూసి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర దర్శకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే థియేటర్స్ లో సత్తా చాటిన ధురంధర్ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఓటీటీలోనూ ధురంధర్ సినిమా ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడమే కాదు టీజర్ ను కూడా రిలీజ్ చేసేశారు మేకర్స్. ఈ టీజర్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లో రణవీర్ సింగ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
ధురంధర్ సినిమాను స్పై థ్రిల్లర్ గా తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ధురంధర్ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు సీక్వెల్ టీజర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాను 2026 మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..