Sholay 4K Movie: ధర్మేంద్రకు నివాళిగా.. మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. షోలే రీ రిలీజ్ ఎప్పుడంటే?

అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హీరోలుగా నటించిన షోలే మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. 50 ఏళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ 4K హంగులతో త్వరలోనే థియేటర్ లో రీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

Sholay 4K Movie: ధర్మేంద్రకు నివాళిగా.. మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. షోలే రీ రిలీజ్ ఎప్పుడంటే?
Sholay Movie

Updated on: Dec 06, 2025 | 7:11 AM

బ్లాక్ బస్టర్ ‘షోలే’ సినిమా విడుదలై సుమారు 50 సంవత్సరాలు అయింది . ఆగస్టు 15, 1975న విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. భారతీయ సినిమా చరిత్రలోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇటీవలే కన్నుమూసిన ధర్మేంద్ర , అమితాబ్ బచ్చన్ , హేమ మాలిని, అమ్జద్ ఖాన్ నటించిన ‘షోలే’ ఇప్పుడు తిరిగి విడుదలవుతోంది. డిసెంబర్ 12న సినిమాను తిరిగి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి ‘షోలే’ 4K రిజల్యూషన్‌లో సందడి చేయనుంది. రమేష్ సిప్పీ ‘షోలే’ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో కూడిన ఈ చిత్రం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. ఈ చిత్రం 50వ వార్షికోత్సవం సందర్భంగా తిరిగి విడుదలవుతోంది. అలాగే, నటుడు ధర్మేంద్ర ఇటీవల మరణించారు. ఆయనకు నివాళి అర్పించేందుకు ‘షోలే’ను తిరిగి విడుదల చేస్తున్నారు.

ధర్మేంద్ర ఇటీవలే కన్నుమూశారు మరణించారు. ఆయన బతికి ఉంటే డిసెంబర్ 8న తన 90వ పుట్టినరోజు జరుపుకునేవారు. ఆయన జ్ఞాపకార్థం ‘షోలే’ సినిమా డిసెంబర్ 12న 1500 థియేటర్లలో తిరిగి విడుదలవుతోంది. కొత్త వెర్షన్ ట్రైలర్ ఇప్పటికే విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1975లో ‘షోలే’ సినిమా విడుదలైనప్పుడు క్లైమాక్స ను మార్చారు. ఎమర్జెన్సీ కారణంగా, సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో మూవీ క్లైమాక్స్ ను మార్చాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అసలు క్లైమాక్స్ సన్నివేశం ఈ సినిమాలో ఉంటుంది. 50 ఏళ్ల నాటి ఈ సినిమాను 4K రెజల్యూషన్ తో పాటు మరికొన్ని హంగులు తీర్చిదిద్ది థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. యూట్యూబ్‌లో విడుదలైన షోలే 4K ట్రైలర్‌ ఇప్పుడు సినీ అభిమానులను బాగ ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన సినీ అభిమానులు ‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. కొత్త సినిమా విడుదలవుతున్న అనుభూతిని ఇస్తుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈనెల 12 గ్రాండ్ గా షోలే రీ రిలీజ్..

ధర్మేంద్రకు నివాళిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.