Dhanush: ఓటీటీ వేదికగా ధనుష్ ‘జగమే తంతిరమ్’ సినిమా.. ఎప్పుడంటే

|

Apr 24, 2021 | 10:07 PM

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘డి 40’

Dhanush: ఓటీటీ వేదికగా ధనుష్ ‘జగమే తంతిరమ్’ సినిమా.. ఎప్పుడంటే
Follow us on

Dhanush:

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘డి 40’ (ధనుష్) ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. తమిళ్‌లో ‘జగమే తంతిరమ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో విడుదల కానుంది.  ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఆయన సరసన ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా  నటిస్తుంది. గతేడాది వేసవిలోనే సినిమా మోషన్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలారోజులు అవుతున్నా ఇంతవరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు దర్శకనిర్మాతలు.

ఇదిలా ఉంటే ధనుశ్ నటించిన తాజా సినిమా ‘కర్ణన్’ సినిమా, ఈ ఏడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ‘జగమే తంతిరమ్’ సినిమా కూడా థియేటర్లకు వస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 11వ తేదీన గానీ 13వ తేదీన గాని ఈ సినిమాను స్ట్రీమింగ్ కి పెట్టాలనే విషయంపై చర్చలు నడుస్తున్నాయట. రిలీజ్ డేట్ తో ట్రైలర్ ను మే 14వ తేదీన వదలాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Anasuya Bharadwaj : అసలు ‘తగ్గేదే లే’ అంటున్న అందాల యాంకరమ్మ.. వరుస ఆఫర్లు అందుకుంటున్న అనసూయ..

Pooja Hegde: కోలీవుడ్ కు పూజాహెగ్డే.. బుట్టబొమ్మకు పట్టుకున్న కొత్త బెంగ.. కారణం ఇదే..

Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్