Dhanush to Simbu: స్టార్ హీరోలకు షాకిచ్చిన నిర్మాతలు.. ఆ నలుగురికి రెడ్ కార్డ్..

|

Sep 14, 2023 | 4:19 PM

కోలీవుడ్ స్టార్ హీరోస్ శింబు, ధనుష్, విశాల్, అధర్వ నలుగురు హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాలు.. ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదు కావడం తెలిసిందే. అయితే వీటిపై చర్చలు జరిగినా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో హీరో శింబుకు రెడ్ కార్డ్‌ జారీ చేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది.

Dhanush to Simbu: స్టార్ హీరోలకు షాకిచ్చిన నిర్మాతలు.. ఆ నలుగురికి రెడ్ కార్డ్..
Dhanush, Vishal, Simbu
Follow us on

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం (సెప్టెంబర్ 13) చెన్నైలో జరిగిన ప్రొడ్యూసర్స్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోస్ శింబు, ధనుష్, విశాల్, అధర్వ నలుగురు హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాలు.. ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదు కావడం తెలిసిందే. అయితే వీటిపై చర్చలు జరిగినా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో హీరో శింబుకు రెడ్ కార్డ్‌ జారీ చేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది.

అలాగే హీరో విశాల్ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంఘం సొమ్మును పక్కదారి పట్టించారని ఆరోపణలు రావడంతో ఆయనకు రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు. హీరో ధనుష్ తేనాండాల్ చిత్రాన్ని ముందుగా అంగీకరించారని.. ఆ తర్వాత 80 శాతం షూట్ పూర్తయినప్పటికీ షూటింగ్‌కు హాజరుకాలేదని.. దీంతో నిర్మాతకు నష్టం కలిగించాడని ఫిర్యాదు నేపథ్యంలో రెడ్ కార్డ్‌ ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే నిర్మాత మథియాజకన్ నిర్మాణ సంస్థతో అథర్వ ఓ చిత్రానికి ఓకే చేశారని.. షూటింగ్ మొదలైనప్పటికీ ఆయన నుంచి సరైన స్పందన లేదనే ఆరోపణలతో యంగ్ హీరో అథర్వకు రెడ్ కార్డ్ ఇవ్వాలని తమిళ సినీ నిర్మాతల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. మొత్తం మీద పలు కారణాలతో ఈ నలుగురు హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వాలని సినీ నిర్మాతల సంఘం నిర్ణయించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.