Captain Miller: ‘శివన్న చిరునవ్వులో పునీత్ కనిపిస్తున్నాడు’.. కన్నడ సూపర్‌ స్టార్‌పై హీరో ధనుష్‌ ప్రశంసలు

|

Jan 05, 2024 | 6:41 AM

మొదటి సినిమాలో రజనీకాంత్‌తో నటిస్తే, రెండో సినిమాలో మాజీ అల్లుడు ధనుష్‌తో కలిసి నటిస్తున్నాడు శివన్న. మరికొద్ది రోజుల్లో కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు ధనుష్ శివన్నపై ప్రశంసలు కురిపించారు.

Captain Miller: శివన్న చిరునవ్వులో పునీత్ కనిపిస్తున్నాడు.. కన్నడ సూపర్‌ స్టార్‌పై హీరో ధనుష్‌ ప్రశంసలు
Dhanush, Shiva Rajkumar
Follow us on

‘ జైలర్ ’ సినిమాతో తమిళ సినీ ప్రియులకు బాగా చేరువైపోయాడు కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌. ఇప్పుడు కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాతో మరోసారి కోలీవుడ్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. మొదటి సినిమాలో రజనీకాంత్‌తో నటిస్తే, రెండో సినిమాలో మాజీ అల్లుడు ధనుష్‌తో కలిసి నటిస్తున్నాడు శివన్న. మరికొద్ది రోజుల్లో కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు ధనుష్ శివన్నపై ప్రశంసలు కురిపించారు. శివరాజ్‌కుమార్‌ను సార్ అని సంబోధించిన ధనుష్‌ ‘ శివన్నా.. మీరు నడిచే స్టైల్ అద్భుతం, జైలర్‌ సినిమాతో మీరు తమిళ సినీ ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. మీ చిరునవ్వులో మీ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్‌, మీ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్ ఇద్దరూ కనిపిస్తారు. తండ్రి సంపాదించిన పేరు ప్రఖ్యాతలను రెట్టింపు చేయడంతో మీరు బెస్ట్‌ ఉదాహరణ. ఈ కార్యక్రమానికి నా పిల్లలు కూడా వచ్చారు. వారు మీ నుండి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు ధనుష్‌.

కెప్టెన్‌ మిల్లర్‌ దర్శకుడు అరుణ్ మట్టేశ్వరన్ గురించి మాట్లాడుతూ.. ‘ దర్శకుడు నన్ను కలుసుకుని కేవలం 15 నిమిషాలకే కథ చెప్పారు. భారీ స్థాయిలో నిర్మించే సినిమా అవుతుందా? నేను అడిగాను. అతను తల ఊపాడు. ఇప్పుడు సినిమా చూసినప్పుడు తను చెప్పినట్లే చేశాడని అనిపిస్తుంది. అరుణ్‌ని చూడగానే వెట్రిమారన్‌ గుర్తొస్తాడు. సినిమాను అద్భుతంగా తీశారు. కథనం, సినిమా చివరి ముప్పై నిమిషాలు అద్భుతంగా ఉంటాయి. అందరూ చూసి ఎంజాయ్ చేయాలనేదే నా కోరిక’ అన్నాడు ధనుష్. ధనుష్‌తో పాటు శివరాజ్ కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కృష్ణ, జాన్ కాకేన్ తదితరులు నటించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం జనవరి 12న పలు భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా ఎంత ఉంటుందనే సమాచారం వచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి