Pushpa 2: “ఎవరి దగ్గరి నుంచీ ఏదీ అడిగి తీసుకోలేం..”

|

Dec 02, 2024 | 10:48 PM

-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామా చిత్రం 'పుష్ప2. డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్‌ నిర్వహించిన పుష్ప ..ఇప్పుడు హైదరబాద్‌లో అదే రేంజ్ ఈవెంట్‌తో అదరగొట్టింది.

Pushpa 2: ఎవరి దగ్గరి నుంచీ ఏదీ అడిగి తీసుకోలేం..
Devi Sri Prasad
Follow us on

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈరోజు పుష్ప ఈ స్థాయిలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది. ముందుగా పుష్ప 1 నుండి పుష్ప 2 వరకు పనిచేసిన నా టీంకు ధన్యవాదాలు తెలపాలి అనుకుంటున్నాను. అలాగే మమ్మల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన దర్శకుడు సుకుమార్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో ఇంత మంచి పాటలు అందించిన చంద్రబోస్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మిగతా భాషలలో ఆ పాటలు అంత బాగా వచ్చేలా రాసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో నటించిన రష్మిక మందన్న అలాగే కిసిక్ సాంగులో పర్ఫామ్ చేసిన శ్రీలీలకు నా ధన్యవాదాలు. అందరికీ ఈ సాంగ్స్ నచ్చినట్లు తెలుస్తుంది. అలాగే నా చిన్ననాటి స్నేహితుడు అల్లు అర్జున్ గురించి చెప్పాలి అంటే తన గురించి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావ్ కూడా నేను వెంటనే అల్లు అరవింద్ గారి వైపు చూస్తాను. ఎందుకంటే మనకంటే ఎక్కువగా మన తండ్రులు గర్వంగా ఫీల్ అవుతారు. నాకింత ఆదరణ చూపిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్” అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.