మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా దేవర. జనత గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంది. దీంతో ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు తారక్. ఈ మూవీలో ఆయన నటనకు విదేశీయులు సైతం ముగ్దులయ్యారు. దీంతో ఇప్పుడు తారక్ నెక్ట్స్ మూవీ కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో తారక్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారని అర్థమవుతుంది. భారీ మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంమటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది జాన్వీ. ఈ సినిమా ఈఏడాది వేసవిలో అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.
సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ.. జనవరి 8న ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది దేవర టీం. ఇక ఇప్పుడు ఈ స్పెషల్ అప్డేట్ కు ఇంకా రెండు రోజులే ఉండడంతో మరోసారి ఫ్యాన్స్ లో జోష్ నింపారు మేకర్స్. దేవర గ్లింప్స్ కు ఇంకా రెండు రోజులే సమయం ఉందంటూ..అందరూ పులికి వందనం అంటూ క్యాప్షన్ ఇస్తూ… తారక్ ఖడ్గంతో ‘D’ అంటూ పోస్టర్ షేర్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ స్పెషల్ పోస్టర్ నెట్టింట వైరలవుతుంది.
ALL HAIL THE TIGER!! #Devara #DevaraGlimpse pic.twitter.com/7ovdC6Je29
— Devara (@DevaraMovie) January 5, 2024
అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్ లో విజువల్స్, బీజీఎమ్, ఎన్టీఆర్ లుక్ అదిరిపోనున్నాయని టాక్ నడుస్తోంది. అలాగే ఈ సినిమాలో జాన్వీ పాత్రకు యాక్షన్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో తారక్ ఇదివరకు ఎన్నడూ చూడని ఊర మాస్ అవతారంలో కనిపించనున్నాడని టాక్. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి ఎప్పటికప్పుడు స్పెషల్ అప్డే్ట్స్ షేర్ చేస్తూ దేవర సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు మేకర్స్.
The Lord of Fear is coming in 3 days 🌊🌊🌊#DevaraGlimpse storming from Jan 8th. #Devara pic.twitter.com/uiQv3pdzO2
— Devara (@DevaraMovie) January 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.