బాలీవుడ్‌లో హిట్ కొట్టాలన్న పూజా హెగ్డే ఆశలు నెరవేరలేదు.. అయితే ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాతో అయినా పూజా బాలీవుడ్ కలలు నెరవేరతాయేమో చూడాలి. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ ఆమె ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తరువాత బాలీవుడ్ ఆశలను సల్మాన్ సినిమా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మీదే పెట్టుకున్నారు పూజా. అయితే సల్మాన్ మూవీ కూడా బుట్టబొమ్మకు షాక్ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది.
దీంతో నార్త్‌లో పూజా హెగ్డే కెరీర్‌కు బ్రేకులు పడినట్టే అని భావించారు సినీ జనాలు. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తే అలా అనిపించటం లేదు. కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్, పూజ మీద పెద్దగా పడినట్టుగా లేదు. తాజాగా బాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బుట్టబొమ్మ.
ప్రజెంట్ పుల్ ఫామ్‌లో ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. కోయి షా అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్‌కు జోడిగా పూజాను సెలెక్ట్ చేశారు మేకర్స్. దీంతో మరోసారి నార్త్‌లో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ బ్యూటీ.
పూజా హెగ్డే ఇన్‌స్టా పోస్ట్..
సౌత్‌లోనూ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు పూజా. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో ఈ బ్యూటీనే హీరోయిన్. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..