Pawan Kalyan: అగ్నిప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు.. హుటాహుటిన సింగపూర్‌‌కు డిప్యూటీ సీఎం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అగ్నిప్రమాదం లో గాయపడ్డారని తెలుస్తుంది. సింగపూర్ ఆస్పత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది. దాంతో పవన్ విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు.  ప్రస్తుతం అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు పవన్‌. అరకు పర్యటన అనంతరం సింగపూర్‌ వెళ్లనున్నారు పవన్

Pawan Kalyan: అగ్నిప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు.. హుటాహుటిన సింగపూర్‌‌కు డిప్యూటీ సీఎం
pawan kalyan son mark shankar File Photo

Edited By:

Updated on: Apr 09, 2025 | 12:13 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అగ్నిప్రమాదం లో గాయపడ్డాడు. ప్రస్తుతం సింగపూర్ ఆస్పత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స  అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పవన్ విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు పవన్‌. అరకు పర్యటన అనంతరం సింగపూర్‌ వెళ్లనున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు పవన్‌.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కల్యాణ్ కి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.