Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్ట్.. కానీ..

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ సాయంతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై రష్మికతోపాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ సీరియస్ అయ్యారు. రష్మిక తర్వాత అలియా భట్, కత్రీనా కైఫ్ లాంటి హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోస్ సైతం వైరలయ్యాయి. అయితే ఈ వీడియోస్ అన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో చేసినట్లు గుర్తించారు. టెక్నాలజీ సాయంతో డీప్ ఫేక్ వీడియోస్ చేయడంపై అమితాబ్ బచ్చన్ సైతం అసహనం వ్యక్తం చేశారు.

Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్ట్.. కానీ..
Rashmika Mandanna

Edited By:

Updated on: Dec 20, 2023 | 12:22 PM

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీతారలు డీప్ ఫేక్ వీడియోస్ వైరలవుతున్నాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్‏ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ సాయంతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై రష్మికతోపాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ సీరియస్ అయ్యారు. రష్మిక తర్వాత అలియా భట్, కత్రీనా కైఫ్ లాంటి హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోస్ సైతం వైరలయ్యాయి. అయితే ఈ వీడియోస్ అన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో చేసినట్లు గుర్తించారు. టెక్నాలజీ సాయంతో డీప్ ఫేక్ వీడియోస్ చేయడంపై అమితాబ్ బచ్చన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోస్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు, ప్రముఖులు డిమాండ్ చేశారు.

రష్మిక డీప్ ఫేక్ వీడియో ఘటనను సీరియస్‏గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆ నలుగురు ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. అయితే నకిలీ వీడియోను తయారు చేసింది మాత్రం వీరు కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వీడియోను సృష్టించిన సృష్టికర్తల కోసం వెతుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ఇటీవలే యానిమల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది రష్మిక. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తండ్రికొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ క్రేజ్ అందుకుంది రష్మిక. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాలో 4 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.