Adipurush: ఆదిపురుష్ సినిమాలో సీతగా కృతిసనన్ కంటే ముందు ఆ హీరోయిన్‌ను అనుకున్నారట!!

|

Jun 18, 2023 | 9:32 AM

ప్రభాస్ శ్రీ రాముడి పాత్రలోనటించగా .. కృతి సనన్ సీత పాత్రలో నటించి మెప్పినిచ్చింది. హిందీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించింది ఈ సినిమా వాల్మీకి రామాయణ గాధను మూల కథగా తీసుకొని పలు మార్పులతో నూతన టెక్నాలజీతో తెరకెక్కించాడు దర్శకుడు.

Adipurush: ఆదిపురుష్ సినిమాలో సీతగా కృతిసనన్ కంటే ముందు ఆ హీరోయిన్‌ను అనుకున్నారట!!
Kriti Sanon
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తోన్న పేరు ఆదిపురుష్. అగ్ర కథానాయకుకుడు ప్రభాస్ నటించిన ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ శ్రీ రాముడి పాత్రలోనటించగా .. కృతి సనన్ సీత పాత్రలో నటించి మెప్పినిచ్చింది. హిందీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించింది ఈ సినిమా వాల్మీకి రామాయణ గాధను మూల కథగా తీసుకొని పలు మార్పులతో నూతన టెక్నాలజీతో తెరకెక్కించాడు దర్శకుడు. వీఎఫ్ ఎక్స్ తో ఈ సినిమాను మరింత ఆసక్తిగా మార్చడు. అయితే ఈ సినిమా పై పలు విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఆదిపురుష్ సినిమా పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే గ్రాఫిక్స్ విషయంలోనూ విమర్శలు ఎదురయాయ్యి. అలాగే ప్రభాస్ లుక్ పై కూడా అభ్యంతరాలు వచ్చాయి.

ఇక ఈ సినిమా విడుదలైన తొలిరోజే భారీ వసూల్ రాబట్టింది. ప్రభాస్ నటించిన మూడు సినిమాలు వరుసగా తొలి రోజు 100కోట్లు వసూల్ చేసి రికార్డ్ సృష్టించించారు. ఇక ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.

సీత పాత్రలో కృతి పలికించిన హావభావాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే దర్శకుడు ఓం రౌత్ ముందుగా ఈ సినిమాలో కృతిని హీరోయిన్ గా అనుకోలేదట. సీత పాత్ర కోసం ముందుగా స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను అనుకున్నారట కానీ దీపికా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆదిపురుష్ సినిమాను మిస్ చేసుకుందట.