ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం పుష్ప (Pushpa). డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్గా నటించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ గత నెలలో పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సౌత్ లోనే కాకుండా.. నార్త్‌లోనూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది ఈ సినిమా. ముఖ్యంగా ఇందులో బన్నీ నటనకు దక్షిణాది ప్రేక్షకుల కంటే ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ సినిమాలోని ప్రతి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాలోని పాటలు సోషల్ మీడియాలో టట్రెండ్ అవుతున్నాయి. విదేశీయులు సైతం పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇక ఇండియన్ క్రికెటర్స్ పుష్ప పాటలకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే శిఖర్ దావన్.. సురేష్ రైనా వంటివారు పుష్ప పాటలకు డ్యాన్స్ చేశారు. ఇక ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో హైద్రాబాద్ సన్ రైజర్స్ టీంలో ఆడుతున్నప్పటి నుంచి తెలుగు సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించారు. ఇక ఇప్పుడు పుష్ప ది రైజ్ పాటలకు డేవిడ్ వార్నర్ తన స్టైల్లో డాన్సులు చేసి ఆకట్టుకున్నారు. తను మాత్రమే కాకుండా.. తన కూతుర్లతోనూ పుష్ప పాటలకు డ్యాన్స్ చేయించాడు వార్నర్. తాజాగా ఫేస్ మాస్క్ యాప్ ద్వారా అల్లు అర్జున్ స్థానంలో తను కనిపించేలా వీడియో క్రియేట్ చేశాడు. ఈ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పుష్పారాజ్ను మాత్రం వార్నర్ అస్సలు వదలడం లేదు.
Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..
Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్
Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..
Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు