AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నర్ సరికొత్త అవతారం.. పాపం పుష్పరాజ్‏ను అస్సలు వదిలిపెట్టడం లేదుగా.. ఈసారి ఇలా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం పుష్ప. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన

Viral Video: వార్నర్ సరికొత్త అవతారం.. పాపం పుష్పరాజ్‏ను అస్సలు వదిలిపెట్టడం లేదుగా.. ఈసారి ఇలా..
Pushpa
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2022 | 7:13 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం పుష్ప (Pushpa). డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‏గా నటించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ గత నెలలో పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సౌత్ లోనే కాకుండా.. నార్త్‏లోనూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది ఈ సినిమా. ముఖ్యంగా ఇందులో బన్నీ నటనకు దక్షిణాది ప్రేక్షకుల కంటే ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమాలోని ప్రతి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాలోని పాటలు సోషల్ మీడియాలో టట్రెండ్ అవుతున్నాయి. విదేశీయులు సైతం పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇక ఇండియన్ క్రికెటర్స్ పుష్ప పాటలకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే శిఖర్ దావన్.. సురేష్ రైనా వంటివారు పుష్ప పాటలకు డ్యాన్స్ చేశారు. ఇక ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో హైద్రాబాద్ సన్ రైజర్స్ టీంలో ఆడుతున్నప్పటి నుంచి తెలుగు సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించారు. ఇక ఇప్పుడు పుష్ప ది రైజ్ పాటలకు డేవిడ్ వార్నర్ తన స్టైల్లో డాన్సులు చేసి ఆకట్టుకున్నారు. తను మాత్రమే కాకుండా.. తన కూతుర్లతోనూ పుష్ప పాటలకు డ్యాన్స్ చేయించాడు వార్నర్. తాజాగా ఫేస్ మాస్క్ యాప్ ద్వారా అల్లు అర్జున్ స్థానంలో తను కనిపించేలా వీడియో క్రియేట్ చేశాడు. ఈ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పుష్పారాజ్‏ను మాత్రం వార్నర్ అస్సలు వదలడం లేదు.

Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు

Follow Us
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు