షాకింగ్..టీవీలో ప్రసారమైన ‘దర్బార్‌’..చానల్‌పై కేసు నమోదు

ఇది తలైవా అభిమానులకు ఖచ్చితంగా షాకింగ్ న్యూసే. ఇటీవల విడుదలైన రజనీకాంత్  ‘దర్బార్‌’ మూవీ రిలీజైన నాలుగు రోజులకే టీవీలో ప్రసారమైంది. దీంతో ప్రొడ్యూసర్స్ కంగుతిన్నారు. తొలుత చిత్ర హెచ్‌డీ వెర్సన్ లింక్ వాట్సాప్‌లో సర్కులేట్ అయింది. దానికి తోడు అందరికి షేర్ ‌చెయ్యమని ఓ వాయిస్ మెసేజ్‌ కూడ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఊహించని విధంగా ఈ నెల 12న శరణ్య టీవీ నిర్వాహకులు మూవీ పైరసీ ప్రింట్‌ను జవనరి 12వ తేదీ […]

షాకింగ్..టీవీలో ప్రసారమైన దర్బార్‌..చానల్‌పై కేసు నమోదు

Edited By:

Updated on: Jan 14, 2020 | 9:26 AM

ఇది తలైవా అభిమానులకు ఖచ్చితంగా షాకింగ్ న్యూసే. ఇటీవల విడుదలైన రజనీకాంత్  ‘దర్బార్‌’ మూవీ రిలీజైన నాలుగు రోజులకే టీవీలో ప్రసారమైంది. దీంతో ప్రొడ్యూసర్స్ కంగుతిన్నారు. తొలుత చిత్ర హెచ్‌డీ వెర్సన్ లింక్ వాట్సాప్‌లో సర్కులేట్ అయింది. దానికి తోడు అందరికి షేర్ ‌చెయ్యమని ఓ వాయిస్ మెసేజ్‌ కూడ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఊహించని విధంగా ఈ నెల 12న శరణ్య టీవీ నిర్వాహకులు మూవీ పైరసీ ప్రింట్‌ను జవనరి 12వ తేదీ మదురైలో ప్రసారం చేశారు. దీనిపై ‘దర్బార్‌’ మూవీ ప్రొడ్యూస్ చేసిన లైకా ప్రొడక్షన్స్‌  తీవ్రంగా ఫైరయ్యింది. టీవీ చానల్‌పై పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై చానల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఈ నెల 9న ‘దర్బార్‌’ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఎ.ఆర్‌. మురుగదాస్‌ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. తొలి రోజు నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోయింది ఈ మూవీ. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.128 కోట్లు వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.